Hyderabad: హైదరాబాదీలకు మరో గుడ్ న్యూస్.. మళ్లీ రోడ్డెక్కనున్న డబుల్ డెక్కర్ బస్సులు.. ఈ రూట్లలోనే!

Hyderabad- Double Decker Buses: ఇలా చరిత్రలో మిగిలిపోయిన ఆ డబుల్ డెక్కర్ బస్సులను టీఎస్‌ఆర్టీసీ రోడ్డెక్కించనుంది. అవునండీ..

Hyderabad: హైదరాబాదీలకు మరో గుడ్ న్యూస్.. మళ్లీ రోడ్డెక్కనున్న డబుల్ డెక్కర్ బస్సులు.. ఈ రూట్లలోనే!
Double Decker Buses

Updated on: Dec 28, 2022 | 7:56 AM

డబుల్ డెక్కర్ బస్సులు.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం నగరంలోని రోడ్లపై పరుగులు పెడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే వాటి నిర్వహణ భారం ఎక్కువైపోతుండటం.. ఆ తర్వాత ఒక్కొక్కటిగా మాయమయ్యాయి. ఇలా చరిత్రలో మిగిలిపోయిన ఆ డబుల్ డెక్కర్ బస్సులను టీఎస్‌ఆర్టీసీ రోడ్డెక్కించనుంది. అవునండీ.. మీరు విన్నది నిజమే..

హైదరాబాదీలకు న్యూఇయర్ వేళ టీఎస్‌ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ అందించింది. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో కొత్త జోష్ నింపేందుకు వచ్చే ఏడాది 10 డబుల్ డెక్కర్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులో తీసుకురానుంది. వీటిని 2023 మార్చిలోపు నగరంలో పరుగులు పెట్టించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ బస్సులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేలా.. వంతెనలు లేని మార్గాల్లోనే తిప్పాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

సికింద్రాబాద్-పటాన్‌చెరు, కోఠి-పటాన్‌చెరు, సీబీఎస్-జీడిమెట్ల, అఫ్జల్‌గంజ్-మెహదీపట్నం, సికింద్రాబాద్-మేడ్చల్, సికింద్రాబాద్-లింగంపల్లి, జీడిమెట్ల-సీబీఎస్, పటాన్‌చెరు-కోఠి మార్గాల్లో ఈ డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి. కాగా, ఇప్పటికే టీఎస్ఆర్టీసీ 50 సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించిన విషయం విదితమే.