Hyderabad: కరోనా కేసులు కాస్త తగ్గాయో లేదు..ఇప్పుడు హైదరాబాదీలకు మరో సమస్య..

|

Jul 08, 2021 | 11:10 AM

Dengue Cases: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఇప్పుడిప్పుడే కేసులు సంఖ్య తగ్గుముఖం పడుతోంది. అయితే.. కరోనా విజృంభణ సమయంలో రాజధాని హైదరాబాద్‌లోనే

Hyderabad: కరోనా కేసులు కాస్త తగ్గాయో లేదు..ఇప్పుడు హైదరాబాదీలకు మరో సమస్య..
Dengue Cases in Hyderabad
Follow us on

Dengue Cases: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఇప్పుడిప్పుడే కేసులు సంఖ్య తగ్గుముఖం పడుతోంది. అయితే.. కరోనా విజృంభణ సమయంలో రాజధాని హైదరాబాద్‌లోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వ్యాప్తి తీవ్రమవ్వడంతో నగరంలోని ప్రజలు వారి సొంత గ్రామాలకు సైతం పయనమయ్యారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో కరోనా తీవ్రత భారీగా తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాదీలకు మరో సమస్య భయభ్రాంతులకు గురిచేస్తోంది. నగరంలో డెంగ్యూ వ్యాప్తి చెందుతున్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడే జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే.. నగరానికి డెంగ్యూ ప్రమాదం పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు పిల్లల ఆసుపత్రులల్లో నలుగురు చిన్నారులు డెంగ్యూ చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.

దోమల వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో అందరూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే.. ఈ వ్యాధి వ్యాప్తి నిరోధించేందుకు.. దోమలను అరికట్టేకుందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కూడా కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దీంతోపాటు ఫాగింగ్, పారిశుధ్యం, పరిశుభ్రత లాంటి విషయాలపై దృష్టిసారించాలని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నగరంలో దోమల వ్యాప్తి కూడా అధికంగా పెరిగింది. దీంతో ఇప్పటినుంచి డెంగ్యూ కేసులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ట్యాంకులు, పూల కుండలు, ట్రేలు, చెత్త, ప్లాస్టిక్‌లలో నీరు చేరి నిల్వ ఉండటం ద్వారా నగరంలో డెంగ్యూ వ్యాప్తి చెందుతున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

దోమల లార్వాను అరికట్టేందుకు ముమ్మరంగా నగరంలో డ్రైవ్ నిర్వహిస్తే.. దోమలను అరికట్టి.. డెంగ్యూను నివారించవచ్చని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా పరిశుభ్రత, పారిశుధ్యం కోసం అవగాహన కల్పించడం కూడా ముఖ్యమని పేర్కొంటున్నారు. అయితే.. ఇటీవల ఉప్పల్ సమీపంలోని రామ్ నగర్లో నిర్వహించిన డ్రైవ్‌లో.. నీటి నిల్వ వల్ల డెంగ్యూ దోమలు పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. కావున ఓ వైపు కరోనాతో పోరాడుతూనే మరోవైపు డెంగ్యూను అరికట్టేందుకు జీహెచ్ఎంసీ పాలకవర్గం, ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. అయితే.. అపరిశుభ్రంగా ఉన్న పరిసరాల నుంచి డెంగ్యూ దోమలు 500 మీటర్ల కంటే ఎక్కువగా ప్రయాణించలేవని.. ఇప్పుడే చర్యలు తీసుకుంటే మంచిదని పేర్కొంటున్నారు.

Also Read:

Ganga Water: గంగానది నీటిలో కరోనా జాడే లేదు.. అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడి

Skin Care: ఎక్కువ గంటలు మాస్క్ ధరించడం వలన చర్మ సమస్యలు.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..