Cyberabad Traffic: ప్రతిరోజూ ఎంతో మంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతుంటారు. వీరిలో కొందరు స్వల్ప గాయాలతో తప్పించుకుంటే మరి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం కోల్పోయే పరిస్థితులు కూడా వస్తుంటాయి. అయితే ట్రాఫిక్ నియమాలను సరిగ్గా పాటిస్తే దాదాపు ప్రమాదాలకు చెక పెట్టవచ్చు. పోలీసులు కూడా ఇదే విషయాన్ని ఎప్పటికప్పుడు నొక్కి చెబుతుంటారు. ప్రమాదం ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో తెలియదు కాబట్టి ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటూ ట్రాఫిక్ రూల్స్‌ను పాటిస్తే మన ప్రయాణం సాఫీగా సాగిపోతుంది.
ప్రమాదాలను గుర్తించి వాటి నుంచి నేర్చుకుంటే కూడా ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఓ వీడియోను ఉపయోగించుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని సైబర్ టవర్స్ దగ్గర ఉన్న జంక్షన్ వద్ద ఓ శునకం రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. మొదటిసారి రోడ్డు దాటే సమయంలో వాహనాలు అడ్డుగా వచ్చాయి. అయితే ఎలాగోలా రోడ్డు దాటేసింది. ఇక రోడ్డు దాటిన ఆ శునకం మళ్లీ రోడ్డు దాటే క్రమంలో మాత్రం చాలా జాగ్రత్తగా వాహనాలు రాని సమయంలో ఎంచక్కా రోడ్డు దాటేసింది. ఇదే విషయాన్ని ఊటంకించిన పోలీసులు ఈ శునకం ప్రమాదం నుంచి ఎంత త్వరగా నేర్చుకొని సరైన సమయంలో రోడ్డు దాటేసింది చూడండి అనే క్యాప్షన్‌ను జోడిస్తూ ఆ వీడియోను పోస్ట్ చేశారు. మరి శునకం నేర్పిన ఈ పాఠానికి సంబంధించిన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
Dog’s quick learning.#RoadSafety #RoadSafetyCyberabad #pedestriansafety pic.twitter.com/6s51HjFL2b
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) July 31, 2021
Also Read: Vizag: ఖతర్నాక్ దొంగల ముఠా.. సినిమా స్టైల్లో ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు..