Hyderabad: కొనసాగుతోన్న ఇంటింటికీ రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌.. సద్వినియోగం చేసుకోవాలని సీఎస్‌ పిలుపు..

|

Oct 30, 2021 | 3:02 PM

కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం నుంచి కాలనీల్లో ప్రత్యేక రెండో డోస్ వ్యాక్సినేషన్

Hyderabad: కొనసాగుతోన్న ఇంటింటికీ రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌.. సద్వినియోగం చేసుకోవాలని సీఎస్‌ పిలుపు..
Follow us on

కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం నుంచి కాలనీల్లో ప్రత్యేక రెండో డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీ అవసరమైన వారి ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని సన్ రైజ్ హోమ్ కాలనీలో ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు. ఆయన వెంట వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ ఇంటింటికీ రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే మూడు కోట్ల మందికి పైగా కోవిడ్‌ వ్యాక్సిన్ అందించామన్నారు. కరోనా నివారణకు కేవలం టీకా తీసుకోవడమే మార్గమని పేర్కొన్నారు .

అనంతరం వైద్య శాఖ కార్యదర్శి రిజ్వీ మాట్లాడుతూ ‘హైదారాబాద్ నగరంలో దాదాపు 90 శాతం పౌరులకు వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. నేటి నుంచి పది రోజులపాటు ఏర్పాటు చేసిన 150 మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా రెండో డోస్ కూడా ఇస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ ‘నగరంలో రెండు మూడు కాలనీలకు ఒక ప్రత్యేక కేంద్రం వద్ద ఈ మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా రెండో డోస్ వ్యాక్సిన్ అందజేస్తాం. ప్రతిరోజూ దాదాపు 450 కాలనీలను కవర్ చేస్తాం. అవసరమైతే వాక్సినేషన్ కార్యక్రమాన్ని మరిన్ని రోజులు పొడిగిస్తాం’ అని తెలిపారు.

Also Read:

Telangana News: కరోనా కష్టాలు.. ఇంటి యజమాని వేధింపులకు హాస్టల్ ఓనర్ బలి.. రెంట్ కట్టలేక ఆత్మహత్య

Prostitution: ఇల్లు అద్దెకు తీసుకున్నారు.. ఆ తర్వాత మొదలు పెట్టేశారు.. చివరికి పోలీసులకు చిక్కారు..

Hyderabad Pubs: తెల్లవార్లూ తెరిచే ఉంటున్న పబ్‌లు..ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా మారని యజమాన్యం తీరు..