Hyderabad: సోషల్ మీడియాలో ఇలాంటి మెస్సేజ్‌లు వస్తున్నాయా..? వెళితే అంతే సంగతులు..

క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ లాభాలు వస్తాయని నమ్మించి మాట్లాడుకుందామని పిలిచారు. చివరికి బెదిరించి రూ.7 లక్షలు బలవంతంగా లాక్కున్నారు. హైదరాబాద్‌లో ఈ ఘటన జరిగింది. దీంతో ఇలాంటి కేసులపై పోలీసులు అప్రమత్తమయ్యారు. క్రిప్టో కరెన్సీ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Hyderabad: సోషల్ మీడియాలో ఇలాంటి మెస్సేజ్‌లు వస్తున్నాయా..? వెళితే అంతే సంగతులు..
Money Fraud

Edited By:

Updated on: Aug 18, 2026 | 12:26 PM

క్రిప్టోకరెన్సీ పేరుతో భారీ లాభాలు వస్తాయని నమ్మించడం.. సోషల్ మీడియాలో పరిచయం పెంచుకోవడం.. ఆ తర్వాత డీల్ మాట్లాడుకుందామంటూ ఓ ప్రాంతానికి పిలిపించడం.. అక్కడికి వెళ్లాక బెదిరించి చేతిలో ఉన్న డబ్బు గుంజేయడం..! హైదరాబాద్‌లో ఓ ముఠా చేస్తున్న అరాచకాలపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా ముఠా సభ్యులను అరెస్టు చేశారు..రూ.7 లక్షలు వసూలు చేసిన కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఫేస్‌బుక్‌లో పరిచయం.. క్రిప్టో పేరుతో వల!

బేగంబజార్‌కు చెందిన జె.ఆర్. చౌదరిని నిందితులు సోషల్ మీడియా ద్వారా సంప్రదించారు. క్రిప్టోకరెన్సీ లావాదేవీలు, పెట్టుబడుల పేరుతో ఆయనకు నమ్మకం కలిగించారు. భారీ మొత్తంలో లాభాలు పొందవచ్చని చెప్పి క్రిప్టో డీల్ కోసం కలుద్దామని ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆగస్టు 15న బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్మాయిల్‌నగర్‌కు చౌదరిని పిలిపించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నిందితులు బెదిరింపులకు పాల్పడి ఆయన వద్ద నుంచి రూ.7 లక్షల నగదు బలవంతంగా తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదుతో బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. ఆగస్టు 17న చాంద్రాయణగుట్టలోని కింగ్స్ స్నూకర్ వద్ద నిందితులు ఉన్నట్లు సమాచారం రావడంతో ప్రత్యేక పోలీస్ బృందం అక్కడికి చేరుకుని నలుగురినీ అరెస్టు చేశారు.

ఫిట్‌నెస్ ట్రైనర్ నుంచి విద్యార్థుల వరకు..

అరెస్టయిన వారిని కాంచన్‌బాగ్‌కు చెందిన ఫిట్‌నెస్ ట్రైనర్ సబేర్ బిన్ అహ్మద్ హద్రానీ అలియాస్ సైఫ్ (A-1), కర్వాన్‌కు చెందిన విద్యార్థి మహమ్మద్ అబుల్ సలామ్ (A-2), రాజేంద్రనగర్‌కు చెందిన విద్యార్థి మహమ్మద్ అనస్ (A-3), పహాడీషరీఫ్‌కు చెందిన డ్రైవర్ *మహమ్మద్ ఆసిఫ్ (A-4)*గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో A-5గా పేర్కొన్న మరో ఆసిఫ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీసులు చెప్తున్నారు

‘క్రిప్టో’ పేరు.. అసలు టార్గెట్ నగదే!

ఈ ముఠా నేర విధానం కూడా ఆసక్తికరంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై ఆసక్తి ఉన్నవారిని గుర్తించి వారితో పరిచయం పెంచుకుంటారు. భారీ లాభాలు వస్తాయని నమ్మించి, డీల్ పేరుతో ఒక ప్రాంతానికి రప్పిస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత బెదిరించి డబ్బు, ఇతర సొత్తును తీసుకోవడం వీరి పద్ధతిగా విచారణలో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఒక్క కేసే కాదు.. పాత కేసుల లింకులు కూడా!

ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు మరిన్ని కీలక సమాచారం వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్‌లోని క్రైమ్ నంబర్ 304/2026తో పాటు చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 86/2026, 261/2026, 310/2026 కేసులతోనూ ఈ ముఠాకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టయిన నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరిచి జుడీషియల్ కస్టడీకి తరలించే ప్రక్రియ చేపట్టారు.

సోషల్ మీడియా ‘క్రిప్టో డీల్స్’తో జాగ్రత్త

సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులు క్రిప్టోకరెన్సీ, పెట్టుబడులు, భారీ లాభాల పేరుతో సంప్రదిస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో నగదుతో అపరిచిత ప్రాంతాలకు వెళ్లొద్దని, ఆర్థిక లావాదేవీలు చేసే ముందు అవతలి వ్యక్తుల వివరాలను పూర్తిగా ధృవీకరించుకోవాలని కోరుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us