Telangana: అనధికార స్టిక్కర్లు పెట్టుకుని వాహనాలు నడుపుతున్నారా? జర జాగ్రత్త.. లేకుంటే..

| Edited By: Velpula Bharath Rao

Nov 23, 2024 | 12:12 PM

అనధికారి స్టిక్కర్లు పెట్టుకొని వాహనాలు నడిపితే తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. ఎవరైనా ఎమ్మెల్యే  ఆన్ డ్యూటీతో ఉన్నటువంటి స్టిక్కర్లు ఉంటే వాటిపై ఎంవీ ఆక్ట్ ప్రకారం ఇకపై కేసులు నమోదు చేయనున్నారు.

Telangana: అనధికార స్టిక్కర్లు పెట్టుకుని వాహనాలు నడుపుతున్నారా? జర జాగ్రత్త.. లేకుంటే..
Criminal Cases Will Be Registered If Vehicles Are Driven With Unauthorized Stickers In Telangana
Follow us on

మీ వాహనాలపై ఆన్ గవర్నమెంట్ డ్యూటీ, ఎమ్మెల్యే అని అనాధికారిక స్టిక్కర్లు ఉంటే క్రిమినల్ కేసులు తప్పవు అని అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు.. ఈ స్టిక్కర్లను పెట్టుకొని ట్రాఫిక్ పాటుగా ఇతర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గుర్తించినటువంటి అధికారులు వీటిపై ఫోకస్ పెట్టారు. ఎవరైనా ఎమ్మెల్యే  ఆన్ డ్యూటీతో ఉన్నటువంటి స్టిక్కర్లు ఉంటే వాటిపై ఎంవీ ఆక్ట్ ప్రకారం ఇకపై కేసులు నమోదు చేయనున్నారు. అనధికారిక స్టిక్కర్లు పెట్టుకొని వాహనాలు నడిపితే ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు.

వాహనాలపై అనాధికారిక స్టిక్కర్లు ఉంటే ఇకపై కేసుల నమోదు చేయనున్నారు ట్రాఫిక్ పోలీసులు.. ఆన్ డ్యూటీ ప్రజా ప్రతినిధుల వాహనాలంటూ స్టిక్కర్లు సైరన్లు అమర్చుకున్న కార్లు ఇతర వాహనాల యజమానులపై క్రిమినల్ కేసులను పోలీసులు నమోదు చేయనున్నారు. గతంలో కొంతమంది వాహన యజమానులు ప్రభుత్వ ఉద్యోగులకు కార్లను అద్దెకు పెట్టి ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని స్టిక్కర్లు అతికించారు. ప్రస్తుతం వారికి అద్దె ఇవ్వకపోయినా ఇప్పటికీ అదే స్టిక్కర్ వినియోగిస్తూ కార్లను నడుపుతున్నారు. కారుపై గవర్నమెంట్ ఆన్ డ్యూటీ కొనసాగించి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ఉల్లంఘన కిందకు వస్తుందని ట్రాఫిక్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ పరిధిలో ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఓ ఖరీదైనటువంటి కారును టాపిక్ పోలీసులు తనిఖీలు చేశారు. కారు లోపల సైరన్ కూడా ఉంది. కారులో ఎమ్మెల్యే గాని ఆయన కుటుంబం సభ్యులు కానీ ఎవరూ లేరు. దీంతో పోలీసులు విచారించగా వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారుగా తేలింది. ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి దుర్వినియోగం చేయడం, అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో వాహన యజమానిపై కేసు నమోదు చేశారు. ఇకనుంచి వాహనాలపై అనాధికారిత వ్యక్తులు స్టిక్కర్ కలిగి ఉంటే ఎంవీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ ఉన్నత అధికారులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి