ఒరిజినల్ సర్టిఫికేట్లు ఉంటేనే కౌన్సిలింగ్‌కు హాజరవ్వండి..

కాళోజీ హెల్త్ యూనివర్శిటీ పరిధిలో మెడికల్ పీజీ కౌన్సిలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌన్సిలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఇవాళ, రేపు హైదరాబాద్ ఉస్మానియా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. మెడికల్ సీట్ల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయని తెలిసి టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనిపై సెంట్రల్ మెడికల్ కౌన్సిల్ కమిటీ కూడా స్పందించింది. ఎవరైనా సీట్ల భర్తీ విషయంలో గోల్‌మాల్ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఒరిజినల్ […]

ఒరిజినల్ సర్టిఫికేట్లు ఉంటేనే కౌన్సిలింగ్‌కు హాజరవ్వండి..

Edited By:

Updated on: Apr 20, 2019 | 1:03 PM

కాళోజీ హెల్త్ యూనివర్శిటీ పరిధిలో మెడికల్ పీజీ కౌన్సిలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌన్సిలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఇవాళ, రేపు హైదరాబాద్ ఉస్మానియా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. మెడికల్ సీట్ల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయని తెలిసి టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనిపై సెంట్రల్ మెడికల్ కౌన్సిల్ కమిటీ కూడా స్పందించింది. ఎవరైనా సీట్ల భర్తీ విషయంలో గోల్‌మాల్ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉంటేనే కౌన్సిలింగ్‌కు రావాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో తాజా కౌన్సిలింగ్‌కు 80శాతం మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. దీంతో.. టీవీ 9కు కృతజ్ఞతలు తెలిపారు స్థానిక అభ్యర్థులు.

మెడికల్ పీజీ సీట్ల భర్తీకి కాళోజీ మెడికల్ వర్సిటీ ఇవాళ, రేపు కౌన్సిలింగ్ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ కాలేజీల్లో 728, ప్రైవేట్ కాలేజీల్లో 749 సీట్లున్నాయి. ఇందులో కన్వీనర్ కోటాలో 375 సీట్లు ఉంటే.. మేనేజ్‌మెంట్ కోటాకు 374 సీట్లు కేటాయించారు. అయితే ఈ సీట్లను మెరిట్ విద్యార్థులతో బ్లాక్ చేస్తున్నాయి కాలేజ్ యాజమాన్యాలు.