
హైదరాబాద్‌లో శునకాలు కరోనా బారినపడ్డాయా.. అవి జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో బాధపడుతున్నాయా అంటే అవుననే అంటున్నారు స్థానికులు. బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు సమీపంలో శునకాలకు కరోనా సింటమ్స్ ఉన్నాయని.. అవి నీరసంగా కనిపిస్తూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ టెర్రర్ క్రియేట్ చేస్తోన్న ప్రస్తుత తరుణంలో వీధి కుక్కల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తుండడంతో వీటికి పరీక్షలు చేయించాలని జంతు ప్రేమికులతో పాటు స్థానికులు కోరుతున్నారు. సాయంత్రం వేళల్లో పార్కు సమీపంలో కుక్కలు దగ్గుతూ, తుమ్ముతూ కనిపిస్తున్నాయని అటువైపు వాకింగ్‌కు వెళ్లే పలువురు చెబుతున్నారు. ప్రభుత్వ వెటర్నరీ విభాగం అధికారులు వెంటనే స్పందించి కేబీఆర్ పార్కు సమీపంలోని శునకాలకు పరీక్షలు చేయించాలని కోరుతున్నారు.
కాగా ఇటీవల కాలంలో సింహాలు కరోనా బారినపడటం చూశాం. ఇప్పుడు శునకాల అటువంటి సింటమ్స్ చూపించడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి వైరస్ తీవ్రస్థాయిలో మనుషులు ప్రాణాలను హరిస్తోంది. ఇప్పుడు జంతువులపై కూడా పంజా విసరడం గుబులు రేపుతోంది. వ్యాక్సిన్ వేయించుకోవడం, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరిగా పాటించండి.
Also Read: గులాబీ గూటికి ఎల్.రమణ..! జోరుగా ప్రచారం.. స్పందించిన ఆయన ఏమన్నారంటే