సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఫామ్‌హౌస్‌లో వెస్ట్ జోన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశ్వర్లు ఎకె 47 గన్‌తో కాల్చుకుని ప్రాణాలు విడిచాడు. అయితే ఉన్నతాధికారుల వేధింపులతోనే అతడు ఆత్మహత్యకు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకున్న సమయంలో వెంకటేశ్వర్లు మద్యంమత్తులో ఉన్నట్లు సిద్ధిపేట సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. గత కొంతకాలంగా అతను విధులకు సరిగ్గా హాజరు కావడం లేదన్నారు. భార్య విజ్ఞప్తితో తిరిగి విధుల్లో వెంకటేశ్వర్లను చేర్పించుకున్నామన్నారు. నల్గొండ జిల్లాలోని చాడ గ్రామం వెంకటేశ్వర్లు స్వస్థలం. కాగా, ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.