Hyderabad: ఆడా ఉంటా.. ఈడా ఉంటా.. ఎంపీగా పోటీ చేసి తిరతానంటున్న మల్లు రవి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి మనసంతా ఎంపీ సీటుపైనే!.మరి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి పోస్ట్‌ మాటేంటి? జోడు పదవులపై తన లెక్కంటో క్లారిటీ ఇచ్చారాయన.

Hyderabad: ఆడా ఉంటా.. ఈడా ఉంటా.. ఎంపీగా పోటీ చేసి తిరతానంటున్న మల్లు రవి
Mallu Ravi

Updated on: Jan 24, 2024 | 10:10 PM

అక్కడ ఆయన.. ఇక్కడ నేను… ఇదీ మల్లు రవి లేటెస్ట్ లాజిక్‌. ఢిల్లీలో ఏపీ సర్కార్‌ ప్రతినిధిగా..వైసీపీ ఎంపీగా  విజయసాయిరెడ్డి రెండు పదవులను నిర్వహిస్తున్నారు. అలానే తాను కూడా రెండు పదవుల్ని సమర్ధవంతంగా మేనేజ్‌ చేయగలనని సోదాహరణంగా చెప్పారు మల్లు రవి. ఎంపీగా పోటీ చేయాలని ఉందని తన  మన్‌ కీ బాత్‌ను స్ట్రయిట్‌గా చెప్పారాయన.

రేవంత్‌ సర్కార్‌ ఇటీవలే  మల్లు రవిని  ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా  నియమించింది. ఈ నెల 28న ఢిల్లీలో  తన పదవి స్వీకరణ కార్యక్రమం ఉంటుందని హైదరాబాద్‌ గాంధీభవన్‌లో చెప్పారాయన.  ప్రత్యేక ప్రతినిధి హోదాలో ఢిల్లీ  వేదికగా  తెలంగాణ  ప్రభుత్వం తరపున సమస్యల పరిష్కారానికి  పనిచేస్తూనే , వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు మల్లు రవి.  ఎంపీగా పోటీ చేయడానికి అడ్డు వస్తుందనుకుంటే ప్రత్యేక ప్రతినిధి  పదవి నుంచి తప్పుకుంటానన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా,ప్రత్యేక ప్రతినిధి గా పని చేయడంలో తనకు  ఎలాంటి ఇబ్బందిలేదన్నారు మల్లు రవి.

గతంలో  కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు తాను ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు.  అప్పట్లో ఎన్నో సమస్యల పరిష్కారానికి  ఎలా కృషిచేశానన్నారు.ఇప్పుడు  మరింత స్పిరిట్‌తో పనిచేస్తానన్నారు. జాతీయ స్థాయి లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పనుల క్లియరెన్స్  కాలేదు.,విభజన హామీలు,ఆంధ్ర, తెలంగాణ గెస్ట్ హౌజ్ కేటాయింపు ల పై క్లారిటీ రాలేదు..వీటిపై దృష్టి సారిస్తానన్నారు. అలాగే  తెలంగాణ కు శబరి హౌజ్ దగ్గర 3.20 ఎకరాలు , పటౌడి హౌజ్ దగ్గర 5.20 గుంటలు భూమి కేటాయింపు ఫైల్‌ కేంద్ర హోంశాఖ దగ్గర వుందన్నారు. త్వరలోనే క్లియరెన్స్‌ వస్తుందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…