GHMC Mayor Election: గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్‌లకు శుభాకాంక్షలు తెలిపిన అసదుద్దీన్ ఓవైసీ
GHMC Mayor Election: గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌గా పార్టీ సెక్రెటరీ జనరల్, రాజ్యసభపక్ష నేత కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని జీహెచ్‌ఎంసీ మేయర్‌గా ఎన్నియ్యారు.
GHMC Mayor Election: గ్రేటర్ హైదరాబాద్ లో టీ ఆర్ ఎస్ పార్టీ సెక్రెటరీ జనరల్, రాజ్యసభపక్ష నేత కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని జీహెచ్‌ఎంసీ మేయర్‌గా ఎన్నియ్యారు. అలాగే డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డి ఎన్నికయ్యారు. విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించగా.. శ్రీలత తార్నాక నుంచి గెలుపొందారు. విజయలక్ష్మి ఎన్నికతో ఆమె ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఓవైసీ వారిని అభినందించారు. ప్రభుత్వం సహకారంతో కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు జీహెచ్ఎంసీ పరిధిలోని పనులను నిజాయితీగా నిర్వహిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ నాయకత్వంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు.
I hope that GHMC will carry out its works with honesty & financial propriety. Also appreciate TRS for offering us Deputy Mayor’s post. [2/2]
— Asaduddin Owaisi (@asadowaisi) February 11, 2021
Also Read: GHMC Mayor Election : గ్రేటర్ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మీ… డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత