అవినీతిని రూపుమాపేందుకు ఎంతదాకైనా పోరాడతానన్న కొత్త మేయర్‌.. ఆ ఇద్దరికి కృతజ్ఞతలు తెలిపిన విజయ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు నూతన మేయర్ గా సీనియర్‌ లీడర్‌, ఎంపీ కె. కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి..

అవినీతిని రూపుమాపేందుకు ఎంతదాకైనా పోరాడతానన్న కొత్త మేయర్‌.. ఆ ఇద్దరికి కృతజ్ఞతలు తెలిపిన విజయ
Follow us
K Sammaiah

|

Updated on: Feb 11, 2021 | 3:44 PM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు నూతన మేయర్ గా సీనియర్‌ లీడర్‌, ఎంపీ కె. కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్ రెండు పదవులనూ టీఆర్ఎస్ గెలుచుకుంది. మజ్లిస్ పార్టీ మద్దతుతో ఆ రెండు పదవులను టీఆర్ఎస్ చేజిక్కించుకుంది.

తామూ బరిలో ఉంటామన్న మజ్లీస్‌ పార్టీ అనూహ్యంగా తన పార్టీ సభ్యులను బరిలోకి దించలేదు. దీంతో ఎక్స్ అఫీషియో ఓట్లు అవసరం లేకుండానే టీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను సాధించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను మహిళలకు ఇవ్వడం పట్ల విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు.

తనపై నమ్మకం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తానని విజయలక్ష్మి చెప్పారు. హైదరాబాద్ నగర అభివృద్ధిని కొనసాగించేందుకు పాటుపడతానన్నారు. నగరంలో మహిళల భద్రతకు తొలి ప్రాధాన్యమిస్తానని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని చెప్పారు. అవినీతిని రూపుమాపేందుకు ఎంతదాకా అయినా వెళ్లి పోరాడుతానని స్పష్టం చేశారు.

Read more:

రెండు తెలుగు రాష్ట్రాల్లో మోగిన మరో ఎన్నికల నగారా.. షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం