Paddy Grain : నాలుగైదు రోజుల్లో ధాన్యం సంపూర్ణ సేకరణ జరుపుతాం.. భయాందోళనలకు గురికావద్దు..ఆగమాగం కావద్దు. : సీఎం

|

May 29, 2021 | 11:17 PM

దేశంలో తెలంగాణ రాష్ట్రం తప్ప ఎక్కడా రైతు వద్ద నుంచి ఒక్క గింజ కూడా కొంటలేరు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా కొన్ని ప్రతిపక్షాలు రైతుల వద్దకు పోయి ధర్నాలు చేయాలని కుయుక్తులకు..

Paddy Grain : నాలుగైదు రోజుల్లో ధాన్యం సంపూర్ణ సేకరణ జరుపుతాం.. భయాందోళనలకు గురికావద్దు..ఆగమాగం కావద్దు. :  సీఎం
Kcr On Paddy Grains Collect
Follow us on

Paddy grain collection in Telangana : తెలంగాణలో నాలుగైదు రోజుల్లో ధాన్యం సంపూర్ణ సేకరణ జరుపుతామని రైతులు భయాందోళనలకు గురికావద్దు..ఆగమాగం కావద్దు అని చెప్పారు సీఎం కేసీఆర్. “దేశంలో తెలంగాణ రాష్ట్రం తప్ప ఎక్కడా రైతు వద్ద నుంచి ఒక్క గింజ కూడా కొంటలేరు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా కొన్ని ప్రతిపక్షాలు రైతుల వద్దకు పోయి ధర్నాలు చేయాలని కుయుక్తులకు పాల్పడుతున్నరు. కానీ వాస్తవం తెలిసిన, విజ్జత కలిగిన రైతులు ప్రతిపక్షాల ఆటలు సాగనిస్తలేరు. తిట్టి ఎల్లగొడుతున్నరు. గత సంవత్సరంలో కరోనా సమయంలో ఆర్ధిక వ్యవస్థ కుప్పుకూలితే తెలంగాణ జీఎస్డీపీకి వ్యవసాయ రంగం 17 శాతం ఆదాయన్ని అందచేసింది. ఇంకా పరోక్షంగా రాష్ట్ర ఆదాయానికి వ్యవసాయ రంగం ఆదెరువుగా మారే పరిస్థితికి చేరుకున్నది” అని సిఎం అన్నారు. అంతేకాదు, వ్యవసాయ స్థిరీకరణ విషయంలో తెలంగాణ నూటికి నూరు శాతం ముందుందని కేసీఆర్ చెప్పారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ ది దేశంలోనే నెంబర్ వన్ స్థానం అన్నారు. ఒక్క మారు మాత్రమే వరి పంట పండించే పంజాబ్ కన్నా తెలంగాణలో రెండు పంటల ద్వారా అధిక దిగుబడి వచ్చిందన్నారు. రాబోయే కాలంలో మెదక్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో ఇంకా మరికొన్ని ప్రాజెక్టులను, లిఫ్టులను పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ రంగం నూటికి నూరు శాతం స్థిరీకరించబడుతుందన్నారు.

కరోనా కష్ట కాలంలో ధాన్యసేకరణ ఒక సాహసం అని చెప్పిన ముఖ్యమంత్రి “ఇవన్నీ అల్లా టప్ప మాటలు కావు. పిచ్చికూతలతోని అయ్యే పనులు కావు. ఇందుకు ఎంతో ధైర్యం కావాలె. ఇవ్వాల తెలంగాణలో రైతుల వద్ద ధాన్యాన్ని కొనడం అంటే ఒక సాహసం. దేశంలో ఏరాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసాన్ని తెలంగాణ చేసింది. కరోనా సమయంలో లారీలు, హమాలీలు, డ్రైవర్లు, అన్ని కొరతే అయినా వాటన్నిటినీ అధిగమిస్తూ, ఇప్పటికే 87 శాతం ధాన్యాన్ని సేకరించినం. మరో నాలుగైదు రోజుల్లో సంపూర్ణ సేకరణ జరుపుతాం. ఎఫ్ సి ఐ తో మాట్లాడి ఎంత ధాన్యం వచ్చినా తప్పకుండా ప్రభుత్వం కొంటుంది. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ భయాందోళనలకు గురికావద్దు..ఆగమాగం కావద్దు.” అని సీఎం అన్నారు.

Read also : Tragedy : కరోనా తెచ్చిన కన్నీటి గాథలు : కన్నతల్లి చనిపోవడంతో బాధను వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య