హైదరాబాదీలకు సూపర్ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ప్లైఓవర్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు!

హైదరాబాద్‌లోని వాహనదారులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఇకపై గంటల కొద్ద ట్రాఫిక్‌లో నిల్చొనే అవసం లేదు. ఎందుకంటే హైదరాబాద్ నగరాభివృద్ధిలో భాగంగా సికింద్రాబాద్ - ఫలక్‌నుమా - శివరాంపల్లి రైల్వే లైన్‌లోని లెవల్ క్రాసింగ్ నంబర్ 7 వద్ద నిర్మించిన శాస్త్రిపురం ఫ్లైఓవర్‌ను ప్రరభానికి సిద్ధమైంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు.

హైదరాబాదీలకు సూపర్ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ప్లైఓవర్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు!
Shastripuram Flyover Inauguration

Updated on: Apr 17, 2026 | 11:32 AM

నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీతో ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్- ఫలక్‌నుమా- శివరాంపల్లిరైల్వే లైన్‌లోని లెవల్ క్రాసింగ్ నంబర్ 7 వద్ద ఈ భారీ ప్లైవోర్ నిర్మాణాన్ని చేపట్టింది. సుమారు రూ. 71 కోట్ల వ్యయంతో 490 మీటర్ల పొడవు,16.60 మీటర్ల వెడల్పుతో రెండు వైపులా రెండేసి లేన్లతో ఈ ప్లైవోర్‌ను నిర్మించారు. శాస్త్రిపురం రోడ్డులో ఉన్న ఈ ఫ్లైఓవర్ మైలార్‌దేవ్‌పల్లిని ఫలక్‌నుమా ఆర్టీసీ బస్ డిపోతో కలుపుతుంది.

ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల పాతబస్తీ, పరిసర ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. దీంతో మైలార్‌దేవ్‌పల్లి – వట్టేపల్లి – ఫలక్‌నుమా మార్గంలో ప్రయాణ సమయం దాదాపు 30 నిమిషాలు తగ్గుతుంది. అలాగే గతంలో మాదిరి రైల్వే క్రాసింగ్ వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా వాహనదారులకు విముక్తి లభిస్తుంది. దీంతో ఇకపై ఎలాంటి అడ్డంకులు లేకుండా వాహనదారులకు సాఫీగా రాకపోకలు సాగించవచ్చు.

అంతేకాదు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ప్రయాణం సాఫీగా సాగడంతో పెట్రోల్ వినియోగం తగ్గడమే కాకుండా, వాయు, శబ్ధ కాలుష్యం కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ ప్లైఓవర్ ఓల్డ్‌ సిటీ వాసులకు ఎంతో ఉపశమనాన్ని కలింగించనుంది. అలాగే ఇది సమీప ప్రాంతాల ఆర్థిక ఆభివృద్ధికి కూడా తోల్పడుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us