ఢిల్లీకి సీఎం రేవంత్ పర్యటన.. కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌తో చర్చ..

|

Aug 15, 2024 | 6:23 PM

సీఎం రేవంత్‌రెడ్డి వరుస పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా, దక్షిణకొరియా దేశాల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి... ఇప్పుడు మరో పర్యటనకు వెళ్తున్నారు. గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఢిల్లీకి సీఎం రేవంత్ పర్యటన.. కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌తో చర్చ..
Cm Revanth Reddy
Follow us on

సీఎం రేవంత్‌రెడ్డి వరుస పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా, దక్షిణకొరియా దేశాల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి… ఇప్పుడు మరో పర్యటనకు వెళ్తున్నారు. గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా రేపు ఢిల్లీలో ఫాక్స్‌కాన్‌ – యాపిల్‌ కంపెనీ ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు.

మరోవైపు పార్టీ హైకమాండ్‌తోనూ భేటీ కానున్నారు రేవంత్‌రెడ్డి. టీపీసీసీ నూతన చీఫ్ ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు మంత్రివర్గ విస్తరణపై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో చర్చించనున్నారు. దీంతోపాటు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు సోనియా గాంధీని, వరంగల్‌లో జరగనున్న రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు.

మంత్రివర్గ విస్తరణ విషయానికి వస్తే…. కేబినెట్‌లో కొందరి శాఖలు మారే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు ఈసారి మైనార్టీలకు స్థానం కల్పించవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలో స్థానంపై పలువురు సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. తమకు అనుకూలంగా ఉన్న మార్గాల ద్వారా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

 

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..