AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth reddy: డ్రగ్స్‌కు స్వస్తి చెప్పండి.. క్రీడా నైపుణ్యాలను పెంచుకోండి.. యువతకు సీఎం రేవంత్ సూచన!

యువత డ్రగ్స్‌కు బానిసైతే దేశ మనుగడ కష్టమవుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ యువతకు దేశంలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని..మన యువకులు ఏదైనా అనుకుంటే సాధించేదాక వదిలిపెట్టరని అన్నారు. తెలంగాణ సాధనలో యువత చూసిన ఉద్యమ స్పూర్తే అందుకు నిదర్శనం అన్నారు. డ్రగ్స్‌కు స్వస్తి పలికి..యువత క్రీడానైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయాల్లోనూ స్పోర్ట్స్ పర్సన్స్‌కు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తామన్నారు.

CM Revanth reddy: డ్రగ్స్‌కు స్వస్తి చెప్పండి.. క్రీడా నైపుణ్యాలను పెంచుకోండి.. యువతకు సీఎం రేవంత్ సూచన!
Cm Revanth Reddy
Anand T
|

Updated on: Jun 26, 2025 | 8:23 PM

Share

అంతర్జాతీయ యాంటీ డ్రగ్ డే సందర్భంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్‌ ఉన్నా ఈ ఈగల్‌ కనిపెడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ యువతకు దేశంలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని.. మన యువకులు ఏదైనా అనుకుంటే సాధించేదాక వదిలిపెట్టరని అన్నారు. తెలంగాణ సాధనలో యువత చూసిన ఉద్యమ స్పూర్తే అందుకు నిదర్శనం అన్నారు. అలాంటి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ యువత ఇప్పుడు డ్రగ్స్‌ బారిన పడడం బాధాకరం అన్నారు.

ప్రపంచంలో 68 శాతం యువత ఉన్న ఏకైక దేశం భారత దేశం అని.. శత్రు దేశాలు మన దేశాన్ని నిర్వీర్యం చేసేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నాయని,, అందులో డ్రగ్స్ మహమ్మారి ఒకటిని సీఎం అన్నారు. అలాంటి డ్రగ్స్‌ బారీన పడి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. పంజాబ్‌లో గంజాయి, డ్రగ్స్‌కు బానిసలుగా మారి యువత నిర్వీర్యమైందని.. తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అందుకోసమే ఏ పాలసీ లేని తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. యువతలో నైపుణ్యం పెంచేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు.

నల్లమల అడవి ప్రాంతం నుంచి వచ్చిన తాను జెడ్పీటీసీ స్థాయి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని. తనలాగే విజయ్ దేవరకొండ నల్లమలనుంచి వచ్చి ఇప్పుడు హీరో స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. కష్టం, కమిట్మెంట్ లేకుండా ఏది సాధ్యం కాదని..సంకల్పంతో ముందుకెళ్తే దేన్నైనా సాధించవచ్చని సీఎం తెలిపారు. యువత డ్రగ్స్‌కు స్వస్తి చెప్పి.. చదువు, స్పోర్ట్స్‌లో రాణించి హీరోలుగా నిలవాలని కోరారు. ఉద్యోగాల్లోనే కాదు.. రాబోయే రోజుల్లో రాజకీయాల్లోనూ స్పోర్ట్స్ పర్సన్స్‌కు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తామన్నారు.

మరోవైపు డ్రగ్స్‌ తీసుకునే నటులను తెలుగు ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు అన్నారు. మలయాళ ఇండస్ట్రీలో ఇప్పటికే ఇలాంటి బహిష్కరణలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. టాలీవుడ్‌లో కూడా త్వరలో ఈ నిర్ణయం తీసుకోబోతుందని దిల్‌రాజు అన్నారు. రైజింగ్ తెలంగాణ స్ఫూర్తినిస్తోంది, డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని నటులు రామ్‌ చరణ్‌ అన్నారు. డ్రగ్స్‌ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వానికి తమ తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందని హీరో రామ్‌చరణ్ అన్నారు.

ఒక దేశాని నాశనం చేయాలి అంటే యుద్ధం అవసరం లేదని, యువతకు డ్రగ్స్‌ అలవాటు చేస్తే చాలని సినీ హీరో విజయ్‌ దేవరకొండ అన్నారు. కొన్ని దేశాలు యువతకు మత్తు అలవాటు చేసి దేశ భవిషత్ నీ నాశనం చేయాలనుకుంటుయని గుర్తుచేశారు. డ్రగ్స్ మన జీవితాల్ని నాశనం చేస్తాయని. ఒక్కసారి వాటికి అలవాటైతే కోలుకోవడం కష్టమని తెలిపారు. డ్రగ్స్ అలవాటు చేసే వారికి దూరంగా ఉండి యువత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే ఆమె ఈ పని
ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే ఆమె ఈ పని
IND vs SL: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!
IND vs SL: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. ఇంతలోనే
డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. ఇంతలోనే
రో-కో కంటే డేంజరస్ అతను.. మావోళ్లకు బడితపూజే..!
రో-కో కంటే డేంజరస్ అతను.. మావోళ్లకు బడితపూజే..!
పీడకలలు ఎందుకు వస్తాయి? శాస్త్రం చెప్పే అసలు కారణాలు, పరిహారాలు..
పీడకలలు ఎందుకు వస్తాయి? శాస్త్రం చెప్పే అసలు కారణాలు, పరిహారాలు..
ఆయన గ్రేట్ హీరో.. మాటల్లో చెప్పలేని అద్భుతమైన నటుడు..
ఆయన గ్రేట్ హీరో.. మాటల్లో చెప్పలేని అద్భుతమైన నటుడు..
హర్భజన్‌కు శ్రీశాంత్‌ రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!
హర్భజన్‌కు శ్రీశాంత్‌ రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!
వామ్మో ఎలా వస్తున్నాయ్ అక్కా ఈ ఐడియాలు.. భర్తను చంపి ఏం చేసిందంటే
వామ్మో ఎలా వస్తున్నాయ్ అక్కా ఈ ఐడియాలు.. భర్తను చంపి ఏం చేసిందంటే
లోన్ యాప్స్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ పని ఖతమే..
లోన్ యాప్స్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ పని ఖతమే..