CM KCR: ఘనంగా ప్రారంభమైన వజ్రోత్సవాలు.. జాతీయ జెండా ఎగరవేసిన సీఎం కేసీఆర్

భారత మాతను గౌరవించాల్సిన కొందరు చిల్లరమల్లర మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఅర్ (CM KCR) మండిపడ్డారు. మహాత్మా గాంధీని అవమానించే పరిస్థితి ఏర్పడిందన్న సీఎం.. మహాత్ముడు ఎప్పటికైనా మహత్ముడేనని వ్యాఖ్యానించారు. దేశానికి...

CM KCR: ఘనంగా ప్రారంభమైన వజ్రోత్సవాలు.. జాతీయ జెండా ఎగరవేసిన సీఎం కేసీఆర్
Cm Kcr
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 08, 2022 | 3:07 PM

భారత మాతను గౌరవించాల్సిన కొందరు చిల్లరమల్లర మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఅర్ (CM KCR) మండిపడ్డారు. మహాత్మా గాంధీని అవమానించే పరిస్థితి ఏర్పడిందన్న సీఎం.. మహాత్ముడు ఎప్పటికైనా మహత్ముడేనని వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణలో (Telangana) వజ్రోత్సవాలు ప్రారంభయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ వేడుకలను సీఎం కేసీఆర్‌ ఘనంగా ప్రారంభించారు. హెచ్‌ఐసీసీలో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా ఆగస్టు 15న ఇంటింటా జాతీయ జెండా ఎగురవేసేందుకు ప్రభుత్వం 1.2 కోట్ల జెండాలను పంపిణీ చేయనుంది. కాగా.. ఈనెల 22న ఎల్బీ స్టేడియంలో వేడుకల ముగింపు కార్యక్రమం ఉంటుంది. సుదీర్ఘ కాల స్వయంపాలనలో భారతదేశంలో తరాలు మారుతున్నాయన్న ముఖ్యమంత్రి.. స్వాతంత్య్ర పోరాట సమయంలో జరిగిన సంఘటనలు కొత్త తరానికి తెలియవని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం అనేవి అపురూప సందర్భాలు. లాలాలజపతిరాయ్‌, బిపిన్‌చంద్రపాల్‌ ఇలా అనేక మంది పోరాటాలు చేశారు. ఝాన్సీ లక్ష్మీబాయి, ఎంతో మంది రాజులు, సంస్థానాదీశులు ఒక్కటై పోరాడారు. మహాత్మాగాంధీ చాలా గొప్ప వ్యక్తి. దక్షిణాఫ్రికాలో ఎదుర్కొన్న జాతివివక్ష, అనేక వ్యవహారాలకు వ్యతిరేకంగా పోరాటం జరిపింది. యావత్‌ ప్రపంచానికే అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన గొప్పవ్యక్తి గాంధీ జీ. గాంధీ గారు ఈ ప్రపంచంలో పుట్టకపోయి ఉంటే ఒబమా అనే నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడిని కానని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా చెప్పారు. అంతటి గొప్ప వ్యక్తి మనదేశంలో జన్మించడం గర్వకారణం.

 – కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

వాడవాడలా గ్రామగ్రామాన స్వతంత్ర కాంక్ష రగలాలి. ఎన్ని త్యాగాలతో, ఎన్ని రకాల పోరాటాలతో, ఆవేదనలతో స్వాతంత్య్రం వచ్చిందో వివరిస్తూ అవగాహన కలిగించాలని సీఎం కేసీఆర్ సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, ఎంపీపీలు తమ పరిధిలో ఉజ్వలం నిర్వహించాలని ఆదేశించారు. స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తి, త్యాగనిరతితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఉందని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..