ఆ 12 ఏళ్ల బుడతడు.. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో డేటా సైంటిస్ట్!

7 వ తరగతి విద్యార్థి సిద్ధార్థ్ శ్రీవాస్తవ్ ను హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ సంస్థ డేటా సైంటిస్ట్‌గా నియమించింది. ఆ 12 ఏళ్ల బాలుడు ఇప్పుడు మాంటైన్ స్మార్ట్ బిజినెస్ సొల్యూషన్స్ కోసం పనిచేస్తున్నాడు. తన తండ్రి కూడా కూడా చాలా చిన్న వయస్సులోనే క్లౌడ్ కంప్యూటింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్నారని సిద్ధార్థ్ తెలిపాడు. చిన్న వయస్సులోనే డెవలపర్ గా గూగుల్ లో ఉద్యోగం సంపాదించిన తన్మయ్ బక్షి నుండి కూడా తాను ప్రేరణ పొందానని […]

ఆ 12 ఏళ్ల బుడతడు.. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో డేటా సైంటిస్ట్!

Edited By:

Updated on: Oct 30, 2023 | 7:42 PM

7 వ తరగతి విద్యార్థి సిద్ధార్థ్ శ్రీవాస్తవ్ ను హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ సంస్థ డేటా సైంటిస్ట్‌గా నియమించింది. ఆ 12 ఏళ్ల బాలుడు ఇప్పుడు మాంటైన్ స్మార్ట్ బిజినెస్ సొల్యూషన్స్ కోసం పనిచేస్తున్నాడు. తన తండ్రి కూడా కూడా చాలా చిన్న వయస్సులోనే క్లౌడ్ కంప్యూటింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్నారని సిద్ధార్థ్ తెలిపాడు. చిన్న వయస్సులోనే డెవలపర్ గా గూగుల్ లో ఉద్యోగం సంపాదించిన తన్మయ్ బక్షి నుండి కూడా తాను ప్రేరణ పొందానని వివరించాడు సిద్ధార్థ్. నా ఆసక్తిని గమనించి నాకు చిన్న వయస్సులోనే కోడింగ్ అర్థం చేసుకోవడానికి సహకరించినందుకు సిద్ధార్థ్ తన తండ్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ యువ డేటా శాస్త్రవేత్త లక్ష్యం వ్యవస్థాపకుడిగా మారి సమాజానికి సహాయం చేయడమే.