TRS vs BJP: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల మధ్య గొడవలు బయటపడ్డాయి. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో జరిగింది. పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా ఆదివారం మల్కాజ్‌గిరిలోని జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ కార్యకర్తులు కూడా పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే జెండా ఆవిష్కరణ జరుగుతోన్న సమయంలో బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తలు గొడవకు దిగారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీనంతటినీ అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు చిత్రీకరించారు. దీంతో పలువురు కార్యకర్తలు మీడియా ప్రతినిధులపై దాడి చేసి ఫోన్‌లను లాక్కొని వెళ్లారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి కూడా పాల్గొన్నారు. ఇరు వర్గాల మధ్య గొడవ జరగడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అసలు గొడవ ఎందుకు జరిగిందన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read: Fuel Tanker Blast: లెబనాన్‌లో ఘోర ప్రమాదం, ఇంధన ట్యాంకర్ పేలి 20 మృతి.. కొనసాగుతున్న సహక చర్యలు