
మొదటి రంగారెడ్డి జిల్లా తైక్వాండో ఛాంపియన్‌షిప్ 2025 శంషాబాద్ లోని జీవా గురుకులంలో అట్టహాసంగా జరిగింది. ఈ టోర్నమెంట్‌ను తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వాహజ్ అలీ, టెక్నికల్ డైరెక్టర్ నరసింహ, రంగారెడ్డి జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ మారుతి, రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ, Wisdomfi.fit వ్యవస్థాపకులు సురేష్ దారెల్లి సంయుక్తంగా ఆదివారం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా తైక్వాండో ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా శ్రీ చిన్న జీయర్ స్వామిజీ హాజరయ్యారు.. అలాగే.. మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు కూడా హాజరయ్యారు.
జీవా గురుకులంకు చెందిన వేద విద్యార్థులు కూడా తైక్వాండోలో వివిధ కేటగిరీల్లో పతకాలు గెలిచారు. ఈ సందర్భంగా తైక్వాండో పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులకు చిన్న జీయర్ స్వామిజీ, జూపల్లి రామేశ్వరరావు పతకాలు, జ్ఞాపికలు అందజేసి వారిని అభినందించారు. గురువుల నిరంతర శిక్షణ, ప్రోత్సాహం వారి విజయానికి మూలకారణమని.. దీంతోనే విద్యార్థులు పోటీల్లో ఘన విజయం సాధించగలిగారంటూ చిన్న జీయర్ స్వామిజీ అభినందించారు. వివిధ కేటగిరీల్లో పతకాలు గెలిచిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన కోచ్‌లు, మాస్టర్లను కూడా చిన్న జీయర్ స్వామీజీ అభినందించారు. వేద విద్యార్థులు వేద శిక్షణతో పాటు శారీరకంగా బలంగా ఉండేందుకు మార్షల్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ పొందడం, జిల్లా స్థాయి పోటీల్లో పతకాలు సాధించడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. ఇక్కడ నిర్వహించిన పోటీల్లో పతకాలు గెలిచిన విద్యార్థులు జులైలో జరిగే రాష్ట్ర స్థాయిలో టోర్నమెంటులో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Ranga Reddy District Taekwondo Championship 2025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..