Hyderabad: హైదరాబాద్ వాసులూ బీ అలర్ట్‌.. వరుస చోరీలతో హడలెత్తించిన స్నాచర్లు.. రెండు గంటల్లో..

|

Jan 07, 2023 | 11:43 AM

హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు హడలెత్తిస్తున్నారు. సీటిలోకి ఎంటర్ అయిన చైన్‌స్నాచర్ల ముఠా.. వరుస దొంగతనలతో రోచ్చిపోయింది.. ప్లానింగ్ ప్రకారం.. దొంగతనాలు చేస్తూ భారీగా దోచుకున్నారు.

Hyderabad: హైదరాబాద్ వాసులూ బీ అలర్ట్‌.. వరుస చోరీలతో హడలెత్తించిన స్నాచర్లు.. రెండు గంటల్లో..
Chain Snatchers
Follow us on

హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు హడలెత్తిస్తున్నారు. సీటిలోకి ఎంటర్ అయిన చైన్‌స్నాచర్ల ముఠా.. వరుస దొంగతనలతో రోచ్చిపోయింది.. ప్లానింగ్ ప్రకారం.. దొంగతనాలు చేస్తూ భారీగా దోచుకున్నారు. కేవలం రెండుగంటల్లో ఆరు స్నాచింగ్‌లతో స్నాచర్లు ఠారెత్తించారు. వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ.. కనిపించకుండా పారిపోయారు. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని ప్రజల్లో భయాందోళన నెలకొంది. అయితే.. ఈ చైన్ స్నాచింగ్ ముఠా ఉప్పల్ పరిధిలోనే 2 చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు. ఉప్పల్ మాస్టర్ చెఫ్ సమీపంలో దుండగులు మహిళ మెడలో నుంచి బంగారం చైన్ లాక్కెళ్లారు. అనంతరం ఉప్పల్ కళ్యాణపురిలో ఉదయం వాకింగ్ కు వెళుతున్న సమయంలో మహిళ మెడలోని పుస్తెలతాడును దుండగులు లాక్కెళ్లారు. ఆతర్వాత నాచారంలోని నాగేంద్రనగర్‌లో, ఓయూ పరిసరాల్లోని రవీంద్రనగర్‌లో, చిలకలగూడ రామాలయం వీధిలో, రాంగోపాల్ పేట్‌ పరిధిలో దొంగలు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. దుండగులు మాస్కులు ధరించి చోరీలకు పాల్పడ్డారు.

హైదరాబాద్ నగరంలో ఈ రోజు ఉదయం జరిగిన చైన్ స్నాచింగ్ వివరాలు..

  • ఉ.6.20గం.కి ఉప్పల్‌లోని రాజధాని కాలనీలో మొదటి స్నాచింగ్‌
  • ఉ.6.40గం.కి ఉప్పల్‌లోని కల్యాణ్‌పురి కాలనీలో..
  • ఉ.7.10గం.కి నాచారంలోని నాగేంద్రనగర్‌ చోరీ
  • ఉ.7.40గం.కి ఓయూ పరిసరాల్లోని రవీంద్రనగర్‌లో స్నాచింగ్
  • ఉ.8గం.కి చిలకలగూడ రామాలయం వీధిలో స్నాచింగ్
  • ఉ. 8.10కి రాంగోపాల్ పేట్‌ పరిధిలో మరొకటి

దొంగల సమయం, స్నాచింగ్ జరిగిన తీరు చూస్తే హైదరాబాద్ వాసులకు అలర్ట్ లాగే కనిపిస్తోంది. లొకేషన్స్‌ టైమింగ్స్ చూస్తే అర్థమవుతోంది.. ఉప్పల్‌ నుంచి మొదలై హబ్సీగూడ మీదుగా సికింద్రాబాద్ వరకూ స్నాచింగ్‌లు చేస్తూ వచ్చారు. అది కూడా ప్రతి 20 నిమిషాలకు ఒక స్నాచింగ్ చొప్పున చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ రూట్‌లోని సీసీ ఫుటేజ్‌లను గాలిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతానికి వీళ్లంతా ఒకటే ముఠా అని గుర్తించారు. చైన్‌ స్నాచర్ల 12 బృందాల గాలింపు చర్యలు చేపట్టాయి. సికింద్రాబాద్‌లో ఆగిన స్నాచింగ్‌లతో ఇప్పటికే పారిపోయి ఉంటారని కూడా అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లో రైల్వే స్టేషన్‌ని సైతం పోలీసులు జల్లెడపడుతున్నారు.వరుస స్నాచింగ్‌లపై మిగతా పోలీస్‌ స్టేషన్లకూ హై అలర్ట్ చేశారు. కాగా.. వరుస చైన్ స్నాచింగ్‌ ఘటనలు నగరంలో భయాందోళనకు గురిచేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..