Hyderabad: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌పై కేసు నమోదు.. అత్యాచార వీడియో బయట పెట్టినందుకు..

Hyderabad: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లిహిల్స్‌లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార సంఘటన కేసు కొత్త ట్విస్ట్ తీసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్‌ రావుపై కేసు నమోదైంది...

Hyderabad: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌పై కేసు నమోదు.. అత్యాచార వీడియో బయట పెట్టినందుకు..
Raghunandan Rao

Edited By:

Updated on: Jun 07, 2022 | 2:32 PM

Hyderabad: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లిహిల్స్‌లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార సంఘటన కేసు కొత్త ట్విస్ట్ తీసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్‌ రావుపై కేసు నమోదైంది. హైదరాబాద్‌ అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఐపీసీ 228 (ఏ) సెక్షన్‌ కింద పోలీసులు కేసు నమోదైంది. అత్యాచార బాధిత బాలిక వీడియో, ఫొటోలు బయపెట్టిన కారణంగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని అమ్నేషియా పబ్‌ సంఘటకు సంబంధించి నిందితులను అరెస్ట్‌ చేయాలని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసి మరీ బాలిక అత్యాచార సంఘటనకు సంబంధించి కొన్ని ఫోటోలను, ఒక వీడియోను బయట పెట్టారు. బెంజ్‌ కారులో జరిగిన దృశ్యాలను రఘునందన్‌ మీడియాకు చూపించారు. దీంతో ఈ ఫొటోలు, వీడియోలు కాస్త నెట్టింట వైరల్ అయ్యాయి. మైనర్ బాలికకు సంబంధించిన వీడియోలను బహిరంగ పరిచినందుకు గాను రఘునందన్‌పై పలువురు విమర్శలు కూడా చేశారు.

ఐపీసీ 228 (ఏ) ప్రకారం అత్యాచారానికి గురైన బాధితురాలి పేరు, ఫొటోల, ఆధారాలను బయటపెడితే సుప్రీం కోర్టు మార్గదర్శకాల ఆధారంగా నేరంగా పరిగణిస్తారు. దీని ఆధారంగా ప్రస్తుతం రఘునందన్‌పై కేసు నమోదు చేశారు. అయితే వీడియోను బయటపెట్టే సమయంలో తాను చూపించిన వీడియోలో ఎక్కడ బాధితురాలి ముఖం కనిపించలేదని రఘునందన్‌ తనను తాను సమర్థించుకున్న విషయం తెలిసిందే. మరి కేసు నమోదైన నేపథ్యంలో రఘునందన్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.