Hyderabad: మియాపూర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. వాహనాలను ఢీకొట్టి పాన్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.