Hyderabad: ఇది కాంగ్రెస్ ప్రభుత్వ తిరోగమన నిర్ణయం.. ఫార్ములా-ఈ రేస్‌ రద్దుపై కేటీఆర్‌

|

Jan 06, 2024 | 11:35 AM

సస్టైనబుల్ మొబిలిటీ సొల్యూషన్స్‌కు కేంద్రంగా రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి తాము తెలంగాణ మొబిలిటీ వ్యాలీని కూడా ప్రారంభించామనని కేటీఆర్‌ ట్వీట్ చేశారు. భారతదేశానికి మొదటిసారిగా ఫార్ములా ఈ-ప్రిక్స్‌ని తీసుకురావడానికి మేము చాలా కృషి, సమయాన్ని వెచ్చించామని కేటీఆర్‌ గుర్తుచేశారు.

Hyderabad: ఇది కాంగ్రెస్ ప్రభుత్వ తిరోగమన నిర్ణయం.. ఫార్ములా-ఈ రేస్‌ రద్దుపై కేటీఆర్‌
KTR
Follow us on

హైదరాబాద్‌లో ఫిబ్రవరి 10వ తేదీన జరగాల్సిన ఫార్ములా ఈ రేస్‌ రద్దు విషయమై మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయమే అని అన్నారు. హైదరాబాద్ ఈ-ప్రిక్స్ వంటి ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా.. హైదరాబాద్ నగరంతో పాటు భారత దేశ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతాయన్నారు.

సస్టైనబిలిటీ ఫోకస్, బజ్‌వర్డ్‌గా మారిన ప్రపంచంలో, హైదరాబాద్‌ను ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా ప్రదర్శించడానికి EV ఔత్సాహికులను, తయారీదారులను, స్టార్టప్‌లను ఆకర్షిస్తూ ఒక వారం పాటు EV సమ్మిట్‌ను నిర్వహించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఫార్ములా E రేస్‌ను ఒక సందర్భంగా ఉపయోగించుకుందని కేటీఆర్‌ గుర్తు చేశారు. సస్టైనబుల్ మొబిలిటీ సొల్యూషన్స్‌కు కేంద్రంగా రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి తాము తెలంగాణ మొబిలిటీ వ్యాలీని కూడా ప్రారంభించామనని కేటీఆర్‌ ట్వీట్ చేశారు. భారతదేశానికి మొదటిసారిగా ఫార్ములా ఈ-ప్రిక్స్‌ని తీసుకురావడానికి మేము చాలా కృషి, సమయాన్ని వెచ్చించామని కేటీఆర్‌ గుర్తుచేశారు.

కేటీఆర్‌ ట్వీట్‌..

హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా రేస్‌ను రద్దు చేస్తున్నట్లు ఎఫ్‌ఐఏ ఫార్యులా ఈ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఏర్పడిని కొత్త ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. గతంలో ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతాల్లో ఈ రేస్‌ జరిగాయి.

అయితే తాజాగా ఈ రేస్‌ సీజన్‌ 10 నాలుగో రౌండ్‌ ఫిబ్రవరి 10వ తేదీన జరగాల్సి ఉండగా నిర్వాహకులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ నిర్వహించకపోవడం బాధాకరమన్న ఫార్ములా ఈ కో ఫౌండర్‌, ఇండియాలో ఫార్ములా రేస్‌ అభిమానులకు ఇది బ్యాడ్‌ న్యూస్‌ అని అభివర్ణించారు. ఇక రేస్‌ నిర్వహణపై గతంలో చేసుకున్న ఒప్పందం ఉల్లంగణపై మున్సిపల్‌ శాఖకు నోటీస్‌ ఇస్తామని నిర్వాహకులు తేల్చి చెప్పారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..