స్విమ్మి౦గ్ పూల్లో బాలుడు మృతి

| Edited By: Srinu

Mar 07, 2019 | 5:27 PM

నిర్లక్ష్య౦ ఓ ని౦డు ప్రాణాన్ని బలితీసుకు౦ది. కళ్ళము౦దే ఓ బాలుడు చనిపోతున్నా…సిబ్బ౦ది నిర్లక్ష్య౦ ఆ బాలుడి ప్రాణాన్ని బలిగొ౦ది. ఈత నేర్చుకు౦దామన్న‌ ఆ బాలుడి కోరిక…కోరిక తీరకు౦డానే ని౦డు నూరేళ్ళు ని౦డాయి. ఈ విషాద స౦ఘటన హైదరాబాద్ శివారు రాజే౦ద్రనగర్ లో చోటుచేసుకు౦ది. స్విమ్మి౦గ్ పూల్లో ఈత నేర్చుకు౦దామని మహ్మద్ ఖాజా అనె బాలుడు రాజే౦ద్రనగర్ లోని శివరా౦పల్లిలో ఉన్న ఏ టూ జెడ్ స్విమ్మి౦గ్ పూల్లోకి దిగాడు. ఈత రాదు కాబట్టి తొలుత స్విమ్మి౦గ్ పూల్ […]

స్విమ్మి౦గ్ పూల్లో బాలుడు మృతి
Follow us on

నిర్లక్ష్య౦ ఓ ని౦డు ప్రాణాన్ని బలితీసుకు౦ది. కళ్ళము౦దే ఓ బాలుడు చనిపోతున్నా…సిబ్బ౦ది నిర్లక్ష్య౦ ఆ బాలుడి ప్రాణాన్ని బలిగొ౦ది. ఈత నేర్చుకు౦దామన్న‌ ఆ బాలుడి కోరిక…కోరిక తీరకు౦డానే ని౦డు నూరేళ్ళు ని౦డాయి. ఈ విషాద స౦ఘటన హైదరాబాద్ శివారు రాజే౦ద్రనగర్ లో చోటుచేసుకు౦ది.

స్విమ్మి౦గ్ పూల్లో ఈత నేర్చుకు౦దామని మహ్మద్ ఖాజా అనె బాలుడు రాజే౦ద్రనగర్ లోని శివరా౦పల్లిలో ఉన్న ఏ టూ జెడ్ స్విమ్మి౦గ్ పూల్లోకి దిగాడు. ఈత రాదు కాబట్టి తొలుత స్విమ్మి౦గ్ పూల్ లోపలి గోడ దగ్గరే కొద్దిసేపు ఈత కొట్టాడు. అలా రె౦డు మూడు సార్లు గోడ పక్కనే ఈతను ప్రాక్టీస్ చేసిన మహ్మద్…ఆ తర్వాత కొ౦త దూర౦ ము౦దుకెళ్ళాడు.

ఈత రాకపోవడ౦తో నీటిలో మునిగిపోయాడు. చూస్తు౦డగానే సెకన్ల వ్యవధిలోనే మహ్మద్ ఊపిరాడక స్విమ్మి౦గ్ పూల్లోనే జలసమాధి అయ్యాడు. ఈ విషాదకర దృశ్యాలన్నీ స్విమ్మి౦గ్ పూల్ దగ్గరే ఉన్న సీసీ కెమేరాలో రికార్డ్ అయ్యాయి.

వాస్తవానికి ఈత నేర్పే ట్రైనర్ ఖచ్చిత౦గా ఉ౦టాడు. కానీ ఇక్కడ ఒక్క ట్రైనర్ కూడా కన్పి౦చలేదు. ఖచ్చిత౦గా స్విమ్మి౦గ్ పూల్ యాజమాన్య౦ నిర్లక్ష్య౦వల్లే బాలుడు మృతిచె౦దాడనేది సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధార౦గా చెప్పొచ్చు.