Telangana: అమిత్ షా – ఈటల భేటీని రాజకీయం చేయవద్దు.. బండి సంజయ్ ఫైర్

|

Jun 20, 2022 | 4:05 PM

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీలో ప్రత్యేకత ఏమి లేదని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. అపాయింట్మెంట్ తీసుకుని ఎవరైనా ఆయనను కలవవచ్చని చెప్పారు. ఈ విషయంలో...

Telangana: అమిత్ షా - ఈటల భేటీని రాజకీయం చేయవద్దు.. బండి సంజయ్ ఫైర్
Bandi Sanjay Kumar
Follow us on

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీలో ప్రత్యేకత ఏమి లేదని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. అపాయింట్మెంట్ తీసుకుని ఎవరైనా ఆయనను కలవవచ్చని చెప్పారు. ఈ విషయంలో తప్పులు, అపార్థాలకు తావు లేదని వెల్లడించారు. తాజాగా.. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించుకొని అమిత్ షా భేటీ అయ్యారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈటలకు జాతీయ స్థాయిలో కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశముందని, అందుకే ఢిల్లీకి రమ్మన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా.. వచ్చే నెలలో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. జూలై 3న హైదరాబాద్‌లో(Hyderabad) జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. సమావేశం అనంతరం ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ సభకు రికార్డు స్థాయిలో 10 లక్షల మందిని సమీకరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఆహ్వానపత్రికలను పంపిణీ చేయాలని తెలంగాణ బీజేపీ నేతలు నిర్ణయించారు. ప్రతి పోలింగ్ బూత్ నుంచి కనీసం 30 మంది చొప్పున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పది వేలకు తగ్గకుండా ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సమావేశాలు సన్నాహక కమిటీ చైర్మన్ డాక్టర్ కే లక్ష్మణ్, కమిటీ జాతీయ ఇన్చార్జ్ అరవింద్ మీనన్ వరుస సమీక్ష సమావేశాలు నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవడంతో రాజకీయ పరిస్థితులు కూడా పార్టీకి అనుకూలంగా మారాయని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని, ఆ దిశలోనే పార్టీ ముందుకు సాగాలని నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి