Telangana Rains: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుల బీభత్సం.. గంట వ్యవధిలో 4 చోట్ల.. నలుగురు మృతి

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. తెలంగాణలో వర్షాలు, పిడుగులు హడలెత్తిస్తున్నాయి.

Telangana Rains: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుల బీభత్సం.. గంట వ్యవధిలో 4 చోట్ల.. నలుగురు మృతి
Lightning Strikes

Updated on: Oct 09, 2021 | 5:08 PM

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. తెలంగాణలో వర్షాలు, పిడుగులు హడలెత్తిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. గంట వ్యవధిలో నాలుగు చోట్ల పిడుగులు పడ్డాయి. నలుగురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారీ మెరుపులు, ఉరుములతో జనాలు భయాందోళనల్లో ఉన్నారు. కాగా జిల్లా యంత్రాంగం ప్రజలంగా ఇళ్లకే పరిమితం అవ్వాలని సూచించింది.

హైదరాబాద్‌లో నేడు కూడా భారీ వర్షం…

మేఘం గర్జించింది. వరుణుడు మెరుపులా దండెత్తాడు. నగరం నదిలా మారింది. హైదరాబాద్ .. హైజలా బాద్.. అయింది. రోడ్డేదో తెలీదు.. డ్రైనేజ్ ఎక్కడుందో అర్ధం కాలేదు. జోరు వానలో.. చిమ్మ చీకట్లో జీహెచ్‌ఎంసీ వాసులు శుక్రవారం పడరాని పాట్లు పడ్డారు. నేడు కూడా సేమ్ సీన్ రిపీటయ్యింది. హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన పడుతోంది. ఈ క్రమంలో నగరంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కడ చూసినా ఇంకా వరదనీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి.

శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా కురిసిన భారీ, అతి భారీ వర్షాలకు హయత్ నగర్ డివిజన్ లోని లంబాడీ తండ కాలనికి వరద నీరు చేరడంతో మొత్తం150 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. సమాచారం మేయర్ గద్వాల విజయ లక్ష్మికి వచ్చిన వెంటనే హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్ కు ఫోన్ చేసి లంబాడీ తండ వాసులను తరలించాలని ఆదేశించారు. మేయర్ వెంటనే వారిని తరలించేందుకు అక్కడికి వాహనం కూడా పంపించారు. డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ ఆధ్వర్యంలో బాధిత 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారికి త్రాగు నీరు భోజన వసతి కల్పించారు.

ఫస్ట్ షో చూసొచ్చేసరికి మరో సినిమా

దిల్ సుఖ్ నగర్ శివ గంగ థియేటర్లో ఫస్ట్ షో సినిమా చూసి బయటకి వచ్చిన ప్రేక్షకులకు.. సెకండ్ షో కనిపించింది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి కాంపౌండ్ వాల్ కూలి.. ఏకంగా 50 బైక్‌లు నుజ్జు నుజ్జయ్యాయి. సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. థియేటర్ యాజమాన్యంతో ఆందోళనకు దిగారు. నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు పోలీసులు కలగజేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Also Read:ఇద్దరు దొంగల ప్రేమకథ.. వీరి స్టోరి సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదు.. స్కెచ్‌లు కూడా నెక్ట్స్ లెవర్

దట్టంగా కమ్మిన మబ్బులు.. గర్జిస్తోన్న మేఘాలు.. హైరదాబాద్‌లో మరికొద్దిసేపట్లో భారీ వర్షాలు