సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. భద్రత కోరుతూ పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ రాయగా.. దానికి రిప్లై ఇస్తూ పోలీసులు రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రీమియర్ షో సెక్యూరిటీ, పర్మిషన్ కోసం సంధ్య థియేటర్ ముందుగానే పోలీసులకు లేఖ రాసింది. ఈ నెల 4న రాత్రి 9.30కి హీరో, హీరోయిన్ సహా వీఐపీలు వస్తున్నారని, బందోబస్త్ కోసం సంధ్య70m.m యాజమాన్యం చిక్కడపల్లి పోలీసులకు 2వ తేదీన లేఖ రాసింది. అయితే పోలీసులు కూడా సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖపై స్పందించి.. సెలబ్రిటీస్ వస్తే ఫ్యాన్స్‌ని, క్రౌడ్‌ని కంట్రోల్ చేయలేమని రిప్లై ఇచ్చారు. అందుకు సంబంధించిన లేఖ తాజాగా బయటకు వచ్చింది.
ఇది చదవండి: బాలకృష్ణ, జానారెడ్డి ఇళ్లకు మార్కింగ్.. ఎందుకో తెలుసా..?
సంధ్య 70mmకి ప్రత్యేకంగా ఎలాంటి ఎంట్రీ, ఎగ్జిట్ లేవని.. అలాగే సంధ్య 70mm, సంధ్య 35mm రెండూ ఒకే కాంపౌండ్‌లో ఉన్నాయని పోలీసులు లేఖలో ప;పేర్కొన్నారు. మూవీ యునిట్ ఎవరూ 4వ తేదీన స్పెషల్ షోకి రావొద్దని.. థియేటర్ యాజమాన్యం ముందే వారికి చెప్పాలని లేఖలో సూచించారు. అయినప్పటికీ వారు వచ్చారని, ఆయన రావడమే కాకుండా అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టారని పోలీసులు తాజాగా తెలిపారు. అల్లు అర్జున్‌ని చూసిన అభిమానులు, ప్రేక్షకులు ఒక్కసారిగా థియేటర్‌లోకి దూసుకెళ్లారని పోలీసులు చెప్పారు. దీంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె కుమారుడు ఆమె కుమారుడు శ్రీతేజ్ సృహ కోల్పోయారని చిక్కడపల్లి పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. మరోవైపు ఈ కేసులో అల్లు అర్జున్‌ను గత శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేయగా.. నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కూడా విధించింది. కానీ.. శుక్రవారం రాత్రి తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో శనివారం ఉదయం చంచలగూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల అయ్యారు.
ఇది చదవండి: వామ్మో! చలి పులి పంజా.. సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాల్లో గజగజ
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి