‘బీజేపీకి ఆశీర్వదిస్తే బీసీని సీఎం చేస్తాం’..! హాట్ టాపిక్‌గా అమిత్ షా వ్యాఖ్యలు..

|

Oct 27, 2023 | 6:58 PM

తెలంగాణలో అసలైన సవాళ్ల యుద్ధం మొదలైంది.. సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా బీజేపీ అగ్రనేత అమిత్‌షా రంగంలో దిగారు. దళిత సీఎంను ఇప్పటికైనా చేసే దమ్ముందా అంటూ బీఆర్ఎస్‌కు బహిరంగ సవాల్‌ విసిరారు. అంతేకాదు తమకు అధికారం అప్పగిస్తే బీసీని సీఎం చేస్తామని ప్రకటించారు అమిత్‌షా.

బీజేపీకి ఆశీర్వదిస్తే బీసీని సీఎం చేస్తాం..! హాట్ టాపిక్‌గా అమిత్ షా వ్యాఖ్యలు..
Big News Big Debate
Follow us on

తెలంగాణలో అసలైన సవాళ్ల యుద్ధం మొదలైంది.. సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా బీజేపీ అగ్రనేత అమిత్‌షా రంగంలో దిగారు. దళిత సీఎంను ఇప్పటికైనా చేసే దమ్ముందా అంటూ బీఆర్ఎస్‌కు బహిరంగ సవాల్‌ విసిరారు. అంతేకాదు తమకు అధికారం అప్పగిస్తే బీసీని సీఎం చేస్తామని ప్రకటించారు అమిత్‌షా. బీజేపీ బీసీ నినాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించనుంది. అటు దళిత సంక్షేమం కూడా ప్రధానఅస్త్రంగా మారింది.

తెలంగాణ ఎన్నికల ప్రచారం జోరందుకుంది.. అగ్రనేతలు రంగంలో దిగారు.. అటు నేతల మధ్య మధ్య సవాళ్ల పర్వం నడస్తోంది. తొలి అభ్యర్ధుల జాబితా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో పర్యటించిన అమిత్‌షా సరికొత్త సంచలనానికి తెరతీశారు. సూర్యాపేట బహిరంగసభ వేదికగా అధికారం అప్పగిస్తే బీసీని సీఎంను చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ బీసీ వ్యతిరేక పార్టీ అంటున్న అమిత్‌ షా… జాతీయస్థాయిలో రాజ్యగంబద్దంగా బీసీ కమిషన్ వేసిన ఘనత బీజేపీదేనన్నారు. ఏడాదికి 10వేల కోట్ల నిధులు ఇస్తామని కేసీఆర్‌ వెనకబడిన వర్గాలను మోసం చేశారన్నారు.

ఓ వైపు అత్యధికంగా ఓట్లున్న బీసీ ఓట్లు టార్గెట్‌ చేస్తూనే.. దళిత అంశాలను ప్రస్తావించారు. దళితులను సీఎం చేస్తానన్న బీఆర్ఎస్‌.. ఇప్పుడు ప్రకటన చేసే దమ్ముందా అంటూ సవాల్‌ విసిరింది బీజేపీ. దళిత సీఎం మాట తప్పిన కేసీఆర్‌ వారికి ఇస్తానన్న మూడెకరాల భూముల విషయంలోనూ మోసం చేశారన్నారు అమిత్‌షా. బీఆర్ఎస్‌, కాంగ్రెస్ రెండూ కుటుంబపార్టీలేనని.. రాహుల్‌ను ప్రధాని చేయాలని సోనియాగాంధీ ఆరాటపడుతుంటే.. కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్‌ చూస్తున్నారని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేలు గెలిచినా మళ్లీ బీఆర్ఎస్‌కు అమ్ముడుపోతారంటోంది బీజేపీ.

బీజేపీ విమర్శలను తిప్పికొట్టారు సీఎం కేసీఆర్‌. ప్రపంచంలో దళితబంధు సృష్టించింది ఎవరని ప్రశ్నించారు. గడిచిన 75 ఏళ్లుగా దళితులను సాయం చేశారా అని ప్రశ్నించారు సీఎం. మొత్తానికి తెలంగాణలో దళిత, బీసీ నినాదాలు గేమ్‌ చేంజర్‌ కాబోతున్నాయా?

ఈ అంశానికి సంబంధించి టీవీలో జరిగిన బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వీడియోను ఇక్కడ చూడండి..