Telangana: తెలంగాణలో బీర్లకు పెరిగిన డిమాండ్‌.. రోజుకు ఎన్ని తాగుతున్నారంటే?

ఎండాకాలం మొదలైంది బయట ఎండలు దంచి కొడుతున్నాయి. ఇక ఎండతాపాన్ని తగ్గించుకోవాలంటే చల్లగా ఒక బీరేయాల్సిందే అంటున్నారు మద్యంప్రియులు. బీర్ల రేట్లు పెరిగినప్పటికీ కొనడానికి మాత్రం వెనకాడట్లేదు. దీంతో రాష్ట్రంలో బీర్ల అమ్మకం భారీగా పెరిగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు దాదాపు 3 లక్షల బీర్ కేస్లు అమ్ముడవుతున్నాయి.

Telangana: తెలంగాణలో బీర్లకు పెరిగిన డిమాండ్‌.. రోజుకు ఎన్ని తాగుతున్నారంటే?
Beer Sales Increase

Edited By: Anand T

Updated on: Apr 29, 2025 | 2:37 PM

ఎండాకాలం మొదలైంది బయట ఎండలు దంచి కొడుతున్నాయి. ఇక ఎండతాపాన్ని తగ్గించుకోవాలంటే చల్లగా ఒక బీరేయాల్సిందే అంటున్నారు మద్యంప్రియులు. బీర్ల రేట్లు పెరిగినప్పటికీ  కొనడానికి మాత్రం వెనకాడట్లేదు.. ఎండల నుంచి ఉపసమనం పొందేందుకు బీర్లు తాగుతూ చిల్‌ అవుతున్నారు. ఎండకాలం, పెండ్లిళ్ల సీజన్ ప్రభావంతో రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు దాదాపు 3 లక్షల బీర్ కేస్లు అమ్ముడవుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఇది రెట్టింపు స్థాయిలో ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి.

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో చల్లని పానీయాలకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా యువత బీర్లు ఎక్కువగా తాగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెండిండ్ల సీజన్ జోరుగా సాగుతోంది. వివాహ వేడుకలు, రిసెప్షన్ల తో బీర్ల వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ కారణంగా బీర్ సరఫరా సంస్థలు డిమాండ్‌కు తగ్గ సప్లయ్ చేసేందుకు బీర్ల ఉత్పత్తిని పెంచినట్లు తెలుస్తోంది.

మరోవైపు రాష్ట్రంలో బీర్ల అమ్మకాల భారీగా పెరడంతో ప్రభుత్వానికి ఎక్సైజ్ రూపంలో ఆదాయం కూడా పెరుగుతోంది. ఈ సీజన్ లో ఎక్సైజ్ శాఖ ఆదాయ లక్ష్యాలను సులభంగా చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఏడాది లిక్కర్ తో పాటు బీర్ కేస్లను మరింతగా పెంచాలని ఎక్సైజ్ శాఖ టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. గతేడాది కంటే కోటిన్నర కేసుల బీర్లు ఎక్కువగా అమ్మాలనుకుంటున్నట్టు సమాచారం. ఇక గత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌ శాక దాదాపు 5.48 కోట్ల కేసుల బీర్లను అమ్మినట్టు తెలుస్తోంది.

అయితే  తాజాగా బేవరేజస్‌ కంపెనీల డిమాండ్‌తో రాష్ట్రంలో ప్రభుత్వం బీర్ల రేట్లు పెంచిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే రాష్ట్రంలో అమ్మకాలు పెరుగుతుండడంతో.. బీర్ల రేట్లు తగ్గించాలని మద్యం ప్రతియులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..