మందుబాబులు నిర్లక్ష్యం వీడటం లేదా? పోలీసుల తీరు వారిని నిషాలోకం నుంచి బయటపడటం లేదా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. నిన్న బంజారాహిల్స్ ప్రమాదంలో నిందితులకు రాచమర్యాదలు చేస్తున్నారు పోలీసులు. నిన్న తెల్లవారుజామున ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నా.. ఇప్పటి వరకు పోలీసులు చర్యలు తీసుకోలేదు. పైగా నిందతులిద్దరికి బంజారాహిల్స్ స్టేషన్‌లోనే వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. వారిని కలవడానికి సహాయకులకు అనుమతిస్తున్న పోలీసులు.. ప్రముఖ హోటల్ నుంచి టిఫిన్, భోజనం తెప్పించుకునేలా సహకరిస్తున్నారు.
సహాయకులు నిందితులకు సపర్యలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఏకంగా ఎస్సై టేబుల్‌పై కూర్చొని టిఫిన్ చేస్తున్నారు ఇద్దరు నిందితులు. నిందితులది హై ప్రొఫైల్ కావడంతో పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. కేసు తీవ్రత తగ్గించాలని నేతలు కోరుతున్నారు.
సెక్షన్‌ల విషయంలో తాత్సారం ప్రదర్శిస్తున్న బంజారాహిల్స్ పోలీసులు.. రెండు రోజులు గడుస్తున్నా.. క్లారిటీ ఇవ్వడం లేదు. చట్టం ప్రకారం సెక్షన్ 304 పార్ట్ 2 కింద కేసు పెట్టాల్సి ఉండగా.. ఎఫ్ఐఆర్ వివరాలపై పోలీసులు నోరు మెదపడం లేదు.
ఇవి కూడా చదవండి: AP Government: భూమిస్తేనే లేఅవుట్లకు అనుమతి.. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
Tiger: భయం గుప్పిట్లో భూపాలపల్లి జిల్లా.. పెద్ద పులి సంచారంతో వణుకుతున్న అటవి గ్రామాలు..