AP Government: భూమిస్తేనే లేఅవుట్లకు అనుమతి.. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

ఏపీలో లేఅవుట్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కొత్త లేఔట్స్‌లో 5శాతం భూమి ప్రభుత్వానికి ఇవ్వాలని నిబంధన తీసుకొచ్చింది. భూమి ఇవ్వకుంటే దానికి..

AP Government: భూమిస్తేనే లేఅవుట్లకు అనుమతి.. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
Andhra Pradesh
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 07, 2021 | 9:05 AM

ఏపీలో లేఅవుట్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కొత్త లేఔట్స్‌లో 5శాతం భూమి ప్రభుత్వానికి ఇవ్వాలని నిబంధన తీసుకొచ్చింది. భూమి ఇవ్వకుంటే దానికి సమానమైన విలువకి డబ్బులు కట్టాలాని జీవో రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఒకవేళ లేఅవుట్ లో భూమి తక్కువ అయితే లేఅవుట్ కి 3 కిలోమీటర్ల పరిధిలో భూమి కొని ఇవ్వాలనే రూల్ తీసుకొచ్చింది. లేఅవుట్స్ లో తీసుకున్న 5 శాతం భూమిని వైస్సార్ జగనన్న కాలనీల ద్వారా పేదలకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ లక్ష్మి.. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.

మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ శాఖలో మ్యూచువల్‌ బదిలీలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పచ్చ జండా ఊపింది. ఈ మేరకు బదిలీలను అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 4వ తేదీ వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పరస్పర అంగీకారంతో బదిలీలకు అనుమతి ఇచ్చింది. ఒకే చోట రెండేళ్లు పనిచేసిన వారు మ్యూచువల్‌ బదిలీలకు అర్హులు అని తెలిపింది.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: మీరు మీ జీవితంలో ఇలాంటి ముగ్గురికి చాలా దూరంగా ఉండండి.. వారు ఎవరో తెలుసుకోండి..

Crime News: గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. వీడియో కాల్ మాట్లాడుతూనే నదిలో దూకిన యువకుడు..