India-Pakistan: ఇండియా-పాకిస్తాన్ వార్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో బాణసంచా కాల్చడంపై నిషేధం!

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలు హై అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌-పాక్‌ మధ్య యుద్ధ పరిస్థితులు సద్దుమణిగే వరకు హైదరాబాద్‌ నగరంలో బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

India-Pakistan: ఇండియా-పాకిస్తాన్ వార్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో బాణసంచా కాల్చడంపై నిషేధం!
Cv Anand

Updated on: May 10, 2025 | 4:01 PM

ఆపరేషన్ సిందూర్‌ తర్వాత భారత్‌ పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ ఆపరేషన్ తర్వాత పాక్‌ భారత్‌లోని ప్రధాన నగరాల లక్ష్యంగా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఇప్పటికే భారత్ సరిహద్దు నగరాల్లో డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు పాల్పడిన పాక్‌.. దేశ రాజధాని ఢిల్లీ సహా దేశంలోని ప్రధాన నగరాలను టార్గెట్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అలర్ట్ అయ్యారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.ఈ క్రమంలోనే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌-పాక్‌ మధ్య యుద్ధ పరిస్థితులు సద్దుమణిగే వరకు హైదరాబాద్‌ నగరంలో బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నగరంలో బాణాసంచా కాల్చడం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోందని ఆయన అభిప్రాయ పడ్డారు. బాణాసంచా శబ్ధాలు సైతం పేలుళ్ల సంభవించినప్పుడు ఏర్పడే శబ్దాల వలే ఉండటంతో, ఇవి ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించేందుకు దారితీయొచ్చని ఆయన భావించారు. ప్రజల్లో భయాందోళనలు తొలగించడం, శాంతిభద్రతలను కాపాడటం వంటి లక్షాలతోనే సీపీ సీవీ ఆనంద్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ ఆంక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని సీవీ ఆనంద్ తెలిపారు. పాక్‌-భారత్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఎవరైన ఈ ఆంక్షలను ఉల్లంఘించి బాణసంచా కాల్చినట్టు తెలుస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించినట్టు సమాచారం. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్ట్యా అందరూ ఈ నిషేధాన్ని పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..