Baby Feeding Room At Secunderabad Railway Station: జనాలతో రద్దీగా ఉండే ప్రదేశాల్లో చిన్నారులకు పాలు పట్టడం తల్లులకు ఇబ్బందితో కూడుకున్న విషయం. చిన్నారి ఆకలితో గుక్కపట్టి ఏడుస్తుంటే తల్లి సౌకర్యంగా పాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇది చాలా మంది మదర్స్ ఎదుర్కునే సమస్యే.
అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. ఈ గదిని మంగళవారం డివిజనల్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా ప్రారంభించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక గదిని పదో నెంబర్ ఫ్లాట్ ఫాం వద్ద ఏర్పాటు చేశారు. క్యూబికల్ సెట్ ద్వారా ప్రత్యేక గదిని రూపొందించారు. వీటి ద్వారా తల్లులు చిన్నారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలు అందించవచ్చు. ఇప్పటి వరకు కేవలం కొన్ని ప్రైవేటు మాల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఇలాంటి ప్రత్యేక గదులను రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో హైదరాబాద్, విజయవాడ డివిజన్ల పరిధిలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో కూడా ఇలాంటి ప్రత్యేక గదులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ గదితో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ ఫామ్ వద్ద పోచంపల్లి చేనేత విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చిన్న ప్రరిశ్రమల వ్యాపారస్తుల అభివృద్ధికి ఈ కేంద్రం తోడ్పడనుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: cock knife: తెలంగాణలో దారుణం.. కోడి కత్తి కడుతుండగా ప్రమాదం.. మర్మాంగాలకు తగలడంతో వ్యక్తి మృతి..