హైదరాబాద్‌లో పాలిటిక్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో హీట్ పెంచుతున్నాయి. రోజుకో మలుపు తీసుకుంటూ హై వోల్టెజ్ క్రియేట్ చేస్తున్నాయి. మొన్నటి వరకు పాతబస్తీ వేదికగా మాటల తూటాలు పేల్చిన పార్టీ నేతలు ఇప్పుడు లోకేషన్ చేంజ్ చేసుకున్నారు. ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్‌గా సాగిన వార్‌లో ఇప్పుడు బీఆర్ఎస్‌ను కూడా టార్గెట్ చేసింది ఎంఐఎం.
జూబ్లీహిల్స్ సెంటర్‌గా కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై విమర్శల వర్షం గుప్పించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్. మరోసారి కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన అసద్.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంతో అజర్ అవినీతికి పాల్పడ్డారంటూ, అందుకే అతనిపై కేసులు కూడా నమోదయ్యాయని ఆరోపించారు. ఇలాంటి అవినీతి మరక ఉన్న వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే ప్రజలకు సేవా చేస్తారా.? అంటూ అసద్ ప్రశ్నించారు.
ఇక జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌పై కూడా అసద్ విరుచుకుపడ్డారు. తన హయంతో ఎలాంటి కార్యక్రమాలు చెప్పట్టలేదని అందుకే జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందలేదన్నారు. అసద్, ఎంఐఎం పార్టీ మావేంటే ఉంది అంటూ మాగంటి ప్రచారం చేస్తున్నారని, అది పూర్తిగా తప్పుడు ప్రచారమంటూ.. ఎన్నికల్లో గెలవలేకే ఇలాంటి పుకార్లు పుట్టించారనన్నారు. ఏదైనా ఉంటే తానే బహిరంగా చెప్తానంటూ తనపై వస్తున్న వార్తలను అసద్ తిప్పికొట్టారు.
హైదరాబాద్‌లో తాము పోటీ చేసే 9 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను ఓడిస్తామని, ఆ తొమ్మిది స్థానాల్లో విజయం తామ పార్టీదే నంటూ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు అసద్. అయితే బీఆర్ఎస్ మాకు మిత్ర పక్షం అయినప్పటికీ పోటీ పోటీనే అన్నారు అసద్. తాజాగా అసద్ బీఆర్ఎస్‌ను టార్గెట్‌గా చేసి విమర్శలు చేయడంతో వెనుక ఎదైనా వ్యూహం ఉందా? ప్రజల దృష్టిని మళ్లీంచాడానికి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా ? అంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో రుమర్స్ నడుస్తున్నాయి. ఇలా రోజుకో టర్న్ తీసుకుంటున్న పాతబస్తీ పాలిటిక్స్ ఎన్నికలు పూర్తయ్యేలోపు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..