Asaduddin Owaisi: రెపో రేట్ల పెంపుపై అసదుద్దీన్‌ ఒవైసీ కౌంటర్.. ఆర్బీఐపై ఆగ్రహం

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. మూడు రోజుల పాటు కొనసాగిన ఆర్బీఐ ద్రవ్య సమీక్ష విధాన సమావేశం నేటితో ముగిసింది. ఈ సమావేశం..

Asaduddin Owaisi: రెపో రేట్ల పెంపుపై అసదుద్దీన్‌ ఒవైసీ కౌంటర్.. ఆర్బీఐపై ఆగ్రహం
Asaduddin Owaisi

Updated on: Dec 07, 2022 | 4:36 PM

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. మూడు రోజుల పాటు కొనసాగిన ఆర్బీఐ ద్రవ్య సమీక్ష విధాన సమావేశం నేటితో ముగిసింది. ఈ సమావేశం అనంతరం కొత్త ఏడాదికి ముందే సామాన్యులకు షాకిచ్చింది. రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. రెపో రేటు వడ్డీ రేటుపై ప్రభావం చూపుతుంది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది. అంతకుముందు సెప్టెంబర్ 30న సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును 5.90 శాతానికి పెంచింది. ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకరంగానే ఉందని ద్రవ్య సమీక్ష విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.

 

ఇవి కూడా చదవండి


ఈ రెపో రేటును 35 పాయింట్లు పెంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై హైదరాబాద్‌ ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు. రిజర్వ్‌ బ్యాంకు 2022 వడ్డీ రేట్కలను 2.25 శాతంకు పెంచిందని కానీ ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రేటు కేవలం 1 శాతం మాత్రమే పెరిగిందన్నారు.ఒక వైపు వడ్డీ రేట్లు పెంచుతూ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రేటు పెంచకపోవడంపై అసదుద్దీన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యత్యాసాన్ని చూపిస్తూ మధ్యతరగతి కుటుంబాలు, సీనియర్‌ సిటిజన్లు ఎందుకు మోసపోతున్నాయని ప్రశ్నించారు. బుధవారం రెపో రేటు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకటించారు. తాజా పెంపుతో రెపోరేటు 6.25 శాతానికి పెరిగింది. తాజాగా ఆర్బీఐ ప్రకటనపై ఆయన ట్విట్టర్‌ వేదికగా ఈ విధంగా కామెంట్స్‌ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి