Nara Rammurthy Naidu: సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూత

|

Nov 16, 2024 | 3:56 PM

Nara Rammurthy Naidu passed away: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు.. శనివారం మధ్యాహ్నం నారా రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచారు.. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి, హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మరణించడంతో నారా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Nara Rammurthy Naidu: సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Chandrababu Naidu Nara Ramamurthy Naidu
Follow us on

Nara Rammurthy Naidu passed away: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, టాలీవుడ్ హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు.. శనివారం మధ్యాహ్నం నారా రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచారు.. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి, హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మరణించడంతో నారా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రామ్మూర్తి నాయుడు శనివారం మధ్యాహ్నం 12.45 లకు మృతిచెందినట్లు ఏఐజీ వైద్యులు ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వైద్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

కాగా.. శనివారం ఉదయం నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్‌ కు చేరుకున్నారు. ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకుని.. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్‌ కు పయనమయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఢిల్లీతోపాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది.. ఈ క్రమంలో సోదరుని ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని. హైదరాబాద్‌కు బయల్దేరారు.

1994-1999 మధ్య చంద్రగిరి MLAగా చేసిన రామ్మూర్తి నాయుడు

1952లో జన్మించారు రామ్మూర్తినాయుడు. నారా కర్జూర నాయుడు, అమ్మన్నమ్మ దంపతుల రెండో కుమారుడు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు నటుడు రోహిత్‌, మరొకరు నారా గిరీష్. 1994లో రామ్మూర్తి నాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 1999 వరకు ప్రజలకు సేవలందించారు. రెండోసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆయన అనారోగ్యంతో రాజకీయాల నుంచి విరామం తీసుకున్నారు.

వీడియో చూడండి..

గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు రామ్మూర్తినాయుడు. ఈ క్రమంలోనే నవంబర్ 14న కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఈ క్రమంలోనే రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబ సభ్యులు అందరూ ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

లైవ్ వీడియో చూడండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..