ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల దాఖలు ప్రక్రియ.. ఇవాళ పరిశీలన అనంతరం తుది జాబితా ప్రకటన

|

Feb 24, 2021 | 9:42 AM

తెలుగు రాష్ట్రాల శాస‌న‌మం‌డలి పట్టభ‌ద్రుల నియో‌జ‌క‌వర్గ ఎన్ని‌క‌లకు నామి‌నే‌షన్ల దాఖలు ప్రక్రియముగి‌సింది. ఇవాళ నామి‌నే‌షన్ల పరి‌శీ‌లన జరు‌గు‌తుంది. అనం‌తరం నామి‌నే‌షన్ల తుది జాబి‌తాను వెల్లడి‌స్తారు.

ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల దాఖలు ప్రక్రియ.. ఇవాళ పరిశీలన అనంతరం తుది జాబితా ప్రకటన
Follow us on

MLC nomination : తెలుగు రాష్ట్రాల శాస‌న‌మం‌డలి పట్టభ‌ద్రుల నియో‌జ‌క‌వర్గ ఎన్ని‌క‌లకు నామి‌నే‌షన్ల దాఖలు ప్రక్రియముగి‌సింది. హైద‌రా‌బాద్‌-రంగా‌రెడ్డి-మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, వరం‌గల్‌-ఖమ్మం-నల్లగొండ నియో‌జ‌క‌వ‌ర్గా‌లకు ఈ నెల 16 నుంచి నామి‌నే‌షన్లు స్వీక‌రించారు. మొత్తం 302 నామి‌నే‌షన్లు వచ్చాయి. మహ‌బూ‌బ్‌‌న‌గ‌ర్-‌రం‌గా‌రెడ్డి-హైద‌రా‌బాద్‌ నియో‌జ‌క‌వ‌ర్గా‌నికి మొత్తం 110 మంది 179 సెట్ల నామి‌నే‌షన్లు రాగా.. మంగ‌ళ‌వారం 51 మంది 89 నామి‌నే‌షన్లు దాఖలు చేశారు. వరం‌గల్‌-ఖమ్మం-నల్లగొండ నియో‌జ‌క‌వ‌ర్గా‌నికి మొత్తం 78 మంది 123 నామి‌నే‌షన్లు వచ్చాయి. చివ‌రి‌రోజు టీఆ‌ర్‌‌ఎస్‌ అభ్యర్థి పల్లాతో‌పాటు 30 మంది 55 సెట్ల నామి‌నే‌షన్లు దాఖలుచేశారు. బుధ‌వారం నామి‌నే‌షన్ల పరి‌శీ‌లన జరు‌గు‌తుంది. అనం‌తరం నామి‌నే‌షన్ల తుది జాబి‌తాను వెల్లడి‌స్తారు. ఉప‌సం‌హ‌ర‌ణకు ఈనెల 26వ తేదీ వరకు గడువు ఉంది.

అటు ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల దాఖలు ముగిశాయి. కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రి య మంగళవారంతో ముగిసింది. గుంటూరు-కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 20 నామినేషన్లు దాఖలుకాగా.. తూర్పు-పశ్చిమగోదావరి ఎమ్మెల్సీ స్థానానికి 12 నామినేషన్లు వచ్చాయి. రెండు స్థానాలకు 32 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ తెలిపారు.

కాగా, మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. అదే నెల 17న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్లు లెక్కించి, అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు.

Read Also…  ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్లు.. రెండు స్థానాలకు 32 మంది దాఖలు..