TS Formula Race: హైదరాబాద్ మహానగరం మరో ఇంటర్నేషనల్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. కేవలం డెవలప్‌డ్ కంట్రీస్, అది కూడా అతికొద్ది దేశాలకే పరిమితమైన ఫార్ములావన్ రేసింగ్‌కు వేదిక కాబోతోంది మన భాగ్యనగరం. వచ్చే ఏడాదే ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్ జరగబోతోంది. 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ఫార్ములావన్ రేసింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయ్. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫార్ములావన్ రేసింగ్ నిర్వహణ కోసం రెండు కమిటీలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మేనేజింగ్ కమిటీ నియమించారు. ఆనంద్ మహీంద్రా, దిల్ బాగ్ డిల్, ఉన్నతాధికారులు, బ్రాండ్ అంబాసిడర్స్, నిపుణులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
మున్సిపల్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్, పోలీస్ ఉన్నతాధికారులు, ఆర్ అండ్ బీ, పురపాలక, విద్యుత్ అండ్ రెవెన్యూ అధికారులు సభ్యులుగా ఉన్నారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న 2.37 కిలోమీటర్ల ట్రాక్‌పై ఈ రేసింగ్ జరగనుంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఫార్ములా ఈ-రేసింగ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. గతంలో గ్రేటర్ నోయిడా వేదికగా ఫార్ములా రేసింగ్ జరిగింది. బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఎఫ్-1 ఈవెంట్ నిర్వహించారు. ఆ తర్వాత ఇండియాలో నిర్వహించబోతున్న రెండో అతిపెద్ద ఈవెంట్‌కు వేదిక కాబోతోంది భాగ్యనగరం.
హైదరాబాద్‌లో ఎఫ్-1 ఈ-రేస్‌ను నిర్వహించేందుకు ఈ ఏడాది జనవరిలో అగ్రిమెంట్ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం, ఫార్ములావన్ మేనేజ్‌మెంట్ కలిసి సంతకాలు చేశాయి. దాంతో, హైదరాబాద్ ఈవెంట్‌కు వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్ సైతం ఆమోదముద్ర వేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి