ఆ క్రెడిట్ అంతా కేటీఆర్‌దే..ఒవైసీ ఇంట్రస్టింగ్ కామెంట్స్

టీఆర్‌ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ. ఆయన్ను మళ్లీ ప్రభుత్వంలో చూసేందుకు ఎదురు చూస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు. లాస్ట్ ఇయర్ ఒప్పో..గతవారం అమెజాన్.. ఇప్పుడు వన్‌ప్లస్‌తో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోందన్న ఓ జర్నలిస్టు ట్వీట్‌పై అసదుద్దీన్ స్పందించారు. ఆ ఘనత మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కే చెందుతోందని కితాబిస్తూ.. ఆయనను మళ్లీ  ప్రభుత్వంలో చూసేందుకు వేచిచూస్తున్నానని వ్యాఖ్యానించారు. ఆ ట్వీట్‌కు కేటీఆర్‌ స్పందిస్తూ అసద్‌కు కృతజ్ఞతలు […]

ఆ క్రెడిట్ అంతా కేటీఆర్‌దే..ఒవైసీ ఇంట్రస్టింగ్ కామెంట్స్

Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 26, 2019 | 9:13 PM

టీఆర్‌ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ. ఆయన్ను మళ్లీ ప్రభుత్వంలో చూసేందుకు ఎదురు చూస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు. లాస్ట్ ఇయర్ ఒప్పో..గతవారం అమెజాన్.. ఇప్పుడు వన్‌ప్లస్‌తో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోందన్న ఓ జర్నలిస్టు ట్వీట్‌పై అసదుద్దీన్ స్పందించారు. ఆ ఘనత మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కే చెందుతోందని కితాబిస్తూ.. ఆయనను మళ్లీ  ప్రభుత్వంలో చూసేందుకు వేచిచూస్తున్నానని వ్యాఖ్యానించారు. ఆ ట్వీట్‌కు కేటీఆర్‌ స్పందిస్తూ అసద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.