Adibatla Kidnap Case: వైశాలి కిడ్నాప్‌ కేసులో నవీన్‌రెడ్డి అరెస్ట్.. గోవాలో అదుపులోకి తీసుకున్న ఆదిభట్ల పోలీసులు

|

Dec 13, 2022 | 9:31 PM

వైశాలి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిని ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్ తర్వాత గోవాకు పారిపోయిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నవీన్ రెడ్డితోపాటు..

Adibatla Kidnap Case: వైశాలి కిడ్నాప్‌ కేసులో నవీన్‌రెడ్డి అరెస్ట్.. గోవాలో అదుపులోకి తీసుకున్న ఆదిభట్ల పోలీసులు
Accused Naveen Reddy
Follow us on

వైశాలి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిని ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్ తర్వాత గోవాకు పారిపోయిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నవీన్ రెడ్డితోపాటు ఏ-6 ఉన్న చందుని కూడా అరెస్ట్ చేశారు. అనంతరం కిడ్నాప్ తర్వాత నిందితులు ఎక్కడికి వెళ్లారు..? పరారీలో ఉన్న మిగతా నిందితుల వివరాలపై ఆరా తీస్తున్నారు. వైశాలి కిడ్నాప్‌ కేసులో సంచలన విషయాలు బయటికొచ్చాయి. పరిచయం దగ్గర్నుంచి కిడ్నాప్‌ వరకు ప్రతీ ఇన్సిడెంట్‌నీ సీన్‌ టు సీన్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో ప్రస్తావించారు పోలీసులు. వైశాలికి, నవీన్‌రెడ్డికి అసలెలా పరిచయం?. కిడ్నాప్‌కి దారితీసిన పరిణామాలన్నీ క్లియర్‌గా కోర్టుకు నివేదించారు. ఆ రిమాండ్‌ రిపోర్ట్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది.

నవీన్‌రెడ్డి, వైశాలి… వీళ్లిద్దరికీ పరిచయం ఏర్పడింది ఓ స్పోర్ట్స్‌ అకాడమీలో. అది కూడా గతేడాదే. ఆ పరిచయాన్ని అడ్డుపెట్టుకొని వైశాలితో కలిసి ఫొటోలు తీసుకున్న నవీన్‌… కొద్దిరోజులకే పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. తల్లిదండ్రులు ఒప్పుకుంటే చేసుకుంటానంటూ వైశాలి బదులివ్వడంతో… ఆమె పేరెంట్స్‌ను ఒప్పించేందుకు ప్రయత్నించాడు. కానీ, ఇక్కడే కథ ఊహించని మలుపు తిరిగింది.

వైశాలి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఉన్మాదిగా మారాడు నవీన్‌రెడ్డి. అప్పట్నుంచీ తనలోని మరో యాంగిల్‌ను చూపెట్టడం మొదలుపెట్టాడు. వైశాలి పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఓపెన్‌చేసి, ఆమెతో కలిసి దిగిన ఫొటోలను వైరల్‌ చేశాడు. అంతటితో ఆగలేదు నవీన్‌రెడ్డి. ఏకంగా వైశాలి ఇంటి దగ్గరకే షిఫ్ట్‌ అయ్యాడు.

ఐదు నెలలక్రితం వైశాలి ఇంటి ముందు షెడ్డేసుకుని మరింత రెచ్చిపోయాడు. ఆగస్ట్‌ 31న ఫ్రెండ్స్‌తో కలిసి వైశాలి ఇంటి ముందు న్యూసెన్స్‌ చేయడం కేసు కూడా నమోదైంది. ఇక, ఈనెల 9న వైశాలికి నిశ్చితార్థం జరుగుతుందని తెలుసుకుని తన అనుచరులు, పనివాళ్లతో కలిసి సినిమాటిక్‌ స్టైల్లో ఎటాక్‌ చేశాడు నవీన్‌రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం