చేసిన సాయం చెప్పుకోవల్సిన అవసరం లేదంటున్న నటుడు జగపతిబాబు..!

కరోనా వేళ మరో విలక్షణ నటుడు తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన నిరు పేదలకు నేనున్నాంటూ ముందుకొచ్చాడు నటుడు జగపతి బాబు. ప‌దివేల మంది నిరు పేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేశాడు. పోలీసులకు, సినీ కార్మికులకు ఎన్‌–95 మాస్కులు, శానిటైజర్లను అందించాడు. ఫ్యామిలీ చిత్రాల హీరోగా అంద‌రి ఆద‌రాభిమానాల్ని అందుకున్న జ‌గ‌ప‌తి బాబు క‌ష్టాల్లో ఉన్న ఫ్యామిలీలను ఆదుకుంటూ భరోసా కల్పిస్తున్నాడు. క‌రోనా వ్యాప్తి నిర్మూల‌న‌లో భాగంగా విధించిన లాక్‌డౌన్ […]

చేసిన సాయం చెప్పుకోవల్సిన అవసరం లేదంటున్న నటుడు జగపతిబాబు..!
Follow us

|

Updated on: May 30, 2020 | 4:10 PM

కరోనా వేళ మరో విలక్షణ నటుడు తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన నిరు పేదలకు నేనున్నాంటూ ముందుకొచ్చాడు నటుడు జగపతి బాబు. ప‌దివేల మంది నిరు పేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేశాడు. పోలీసులకు, సినీ కార్మికులకు ఎన్‌–95 మాస్కులు, శానిటైజర్లను అందించాడు. ఫ్యామిలీ చిత్రాల హీరోగా అంద‌రి ఆద‌రాభిమానాల్ని అందుకున్న జ‌గ‌ప‌తి బాబు క‌ష్టాల్లో ఉన్న ఫ్యామిలీలను ఆదుకుంటూ భరోసా కల్పిస్తున్నాడు. క‌రోనా వ్యాప్తి నిర్మూల‌న‌లో భాగంగా విధించిన లాక్‌డౌన్ తో దినసరి వేతనం పొందే ఎంతో మంది సినీ కార్మికులు, పేద‌లు నిత్యావ‌స‌రాల కోసం ఇబ్బందులు ప‌డుతున్నారు. సినీ ప్ర‌ముఖులు, వ్యాపార వేత్త‌లు వారికి త‌మ వంతు సాయం చేస్తున్నారు. ‌నటుడు జగపతిబాబు.. ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు త‌నే స్వ‌యంగా బియ్యం, పప్పులు, వంట నూనె తదితర నిత్యావసరాలను అందించారు. లాక్‌డౌన్‌ని ప‌క‌డ్భందీగా నిర్వ‌హిస్తున్న సమయంలో పోలీసుల‌కి గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ వి.సి.సజ్జనార్‌ను కలిసి ఎన్‌–95 మాస్కులు, శానిటైజర్లను అందించి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. ఇవే కాకుండా ఇటీవ‌ల‌ ఇబ్బందులలో ఉన్న‌ ప‌దివేల మంది పేద‌ల‌కి నిత్యావ‌స‌ర స‌రుకులు, మాస్కులు, శానిటైజర్లను అంద‌జేశారు. ఈ విషయంపై స్పందించిన జ‌గ‌ప‌తి బాబు.. సాయం చేసిన మాట వాస్త‌వ‌మే కానీ, చేసిన ప్ర‌తి సహాయం అంద‌రికీ తెలియాల్సిన అవ‌సరం లేదు క‌దా… ఆప‌ద‌లో ఉన్న వారికి స‌హాయం చేశానంటూ.. సింపుల్‌గా కొట్టి పారేశారు. జ‌గ‌ప‌తిబాబు తండ్రి ప్ర‌ముఖ ద‌ర్శక నిర్మాత వి.బి. రాజేంద్ర‌ప్ర‌సాద్‌ కూడా ఎన్నో విపత్కర పరిస్థితుల్లో తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తండ్రి బాటలో తనయుడు జగపతిబాబు చేస్తున్న సాయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?