Hyderabad: మాజీ లవర్‌ కోసం దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన యువతి.. చివరికి ఊహించని ట్విస్ట్.

మాజీ ప్రియుడి కోసం దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చింది ఓ యువతి. అయితే ప్రియుడి ఇచ్చిన ట్విస్ట్‌కు ఒక్కసారిగా షాక్‌కి గురైంది ఆ యువతి. మాజీ ప్రియుడి చేసిన పనికి మోసపోయానని తెలిసిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. బోరబండ రాజ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన..

Hyderabad: మాజీ లవర్‌ కోసం దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన యువతి.. చివరికి ఊహించని ట్విస్ట్.
Hyderabad

Updated on: Feb 13, 2023 | 10:21 AM

మాజీ ప్రియుడి కోసం దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చింది ఓ యువతి. అయితే ప్రియుడి ఇచ్చిన ట్విస్ట్‌కు ఒక్కసారిగా షాక్‌కి గురైంది ఆ యువతి. మాజీ ప్రియుడి చేసిన పనికి మోసపోయానని తెలిసిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. బోరబండ రాజ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి టెలీకాలర్‌గా పని చేసింది. ఇదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో మహారాష్ట్రకు చెందిన జల్‌గావ్‌కు చెందిన సైఫ్‌ అనే వ్యక్తితో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సైఫ్‌ పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహ జీవనం చేశాడు.

ఈ క్రమంలోనే 2020లో యువతి కుటుంబసభ్యులు ఆమెకు వివాహం చేశారు. వివాహం చేసుకున్న అనంతరం యువతి దుబాయికి వెళ్లింది. ఈ సమయంలోనే మళ్లీ యువతితో కాంటాక్ట్‌లోకి వచ్చిన సైఫ్‌.. భర్తకు విడాకులిచ్చి రావాలని, తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో సైఫ్‌ మాటలు నమ్మిన యువతి.. వెనకా ముందు ఆలోచించకుండా భర్తను వదిలేసి హైదరాబాద్‌కు వచ్చేసింది. అనంతరం ఆమెకు గర్భస్రావం సైతం చేయించాడు.

ఇలా కొంత కాలం కలిసి ఉండి తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు సైఫ్‌. ఈనెల 22న వేరొక యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఈ విషయం తెలిసిన యువతి సైఫ్‌ స్వగ్రామానికి వెళ్లి నిలదీసింది. సైఫ్‌తోపాటు అతని కుటుంబ సభ్యులు కూడా యువతిపై మాటల దాడికి దిగడంతో తిరి నగరానికి చేరుకున్న యువతి.. ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు ఎస్సార్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..