సనత్‌నగర్‌లో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పట్టపగలు ఈ ఘటన జరిగినా రోడ్డుపై ఉన్నవారు మంటలను ఆర్పే ప్రయత్నం కూడా చేయలేదు. స్నేహపురి కాలనీలో వెంకటేష్ గుప్తా అనే వ్యాపారి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలకు తట్టుకోలేక గట్టిగా కేకలు వేశాడు. అయినా అక్కడ ఉన్న వాళ్లు స్పందించలేదు. చివరికి అతని భార్య మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. అయినా ఫలితం లేకుంగా పోయింది. వెంకటేష్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ఆత్మహత్య దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. వెంకటేష్ కిరాణాషాపు నిర్వహిస్తున్నాడు. కుటుంబసమస్యలు, ఆర్థిక కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.