AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: ప్రియురాలికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం.. అది తెలిసి తట్టుకోలేకపోయిన ప్రియుడు.. ఏం చేశాడంటే..

Crime News: ప్రేమించిన వారి కోసం ఎంతకైనా తెగిస్తారు కొందరు ప్రేమికులు. కొందరు ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తే..

Crime News: ప్రియురాలికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం.. అది తెలిసి తట్టుకోలేకపోయిన ప్రియుడు.. ఏం చేశాడంటే..
Kidnap Case
Shiva Prajapati
|

Updated on: Apr 18, 2021 | 9:28 AM

Share

Crime News: ప్రేమించిన వారి కోసం ఎంతకైనా తెగిస్తారు కొందరు ప్రేమికులు. కొందరు ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. మరికొందరు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేసి ప్రేమికులిద్దరూ కలిసుండేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి ఘటన తాజాగా హైదరాబాద్‌ నగరంలోని మైలార్‌దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే.. పాతబస్తీని చెందిన ఓ యువకుడు స్థానికంగా ఉండే యువతిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఇంతలో యువతి తల్లిదండ్రులు ఆమెకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారు. పాతబస్తీలోని మైలార్‌దేవ్ పల్లి శాస్త్రీపురం కింగ్స్ కాలనీకి చెందిన నదీమ్ అనే యువకుడికి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని యువతి కుటంబ సభ్యులు నిర్ణయించారు.

ఈ క్రమంలోనే యువతికి, నదీమ్‌కు నిశ్చితార్థం జరిపించారు. అయితే ఇది తెలుసుకున్న ప్రియుడు.. నిశ్చితార్థాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలని డిసైడ్ అయ్యాడు. ఇంకేముందు నదీమ్‌ను కిడ్నాప్‌ చేయాలని భావించాడు. ఆ మేరకు స్కెచ్ వేశాడు. శనివారం నాడు నదీమ్ బైక్‌పై వెళ్తుండగా.. సదరు ప్రియుడు కారులో వచ్చి అడ్డగించాడు. నదీమ్‌ను కారులోకి లాక్కె్ళ్లి కిడ్నాప్ చేశాడు. యువతిని తాను ప్రేమించానని, ఆమెతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. కాగా, ఈ కిడ్నాప్‌కు వ్యవహారం అంతా ఘటనా స్థలంలో ఉన్న సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. కిడ్నాప్ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్నారు. సిసి కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also read:

Ala Vaikuntapuramlo: ‘అల..వైకుంఠపురములో’ సునామి ఇప్పట్లో ఆగేలా లేదు.. తాజాగా మరో క్రేజీ రికార్డ్

Hyderbad: ప్రేమించి పెళ్లి చేసుకొని.. మరో యువతితో ప్రేమాయణం.. భార్యకు తెలియడంతో..

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణ పరిస్థితులు.. భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు..