Hyderbad: ప్రేమించి పెళ్లి చేసుకొని.. మరో యువతితో ప్రేమాయణం.. భార్యకు తెలియడంతో..
Young Man Suicide in Hyderbad: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏడాదే అయ్యింది. అందమైన జంట.. కానీ.. ఆ యువకుడు మళ్లీ దారితప్పాడు.. మరో యువతితో పీకల్లోతులో ప్రేమలో కూరుకుపోయాడు. చివరకు
Young Man Suicide in Hyderbad: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏడాదే అయ్యింది. అందమైన జంట.. కానీ.. ఆ యువకుడు మళ్లీ దారితప్పాడు.. మరో యువతితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడు. చివరకు ఈ ప్రేమాయణం విషయం కాస్త భార్యకు తెలిసింది. మరోవైపు ప్రియురాలి నుంచి కూడా పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి పెరిగింది. ఇక ఏం చేయాలో ఆ యువకుడికి అర్థంకాలేదు. దీంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సైదాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబజార్‌లోని రెయిన్ బజార్‌కు చెందిన దీపక్ కుమార్ (18) హయత్ నగర్‌కు చెందిన యువతిని గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకొని అక్కడే కాపురం పెట్టాడు.
కాపురం సజావుగా సాగుతున్న క్రమంలో దీపక్ ఇటీవల మరో యువతితో ప్రేమలో మునిగాడు. ఈ ప్రమాయణం కొన్ని రోజులుగా సాగుతోంది. ఈ విషయం భార్యకు తెలియడంతో భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతోపాటు మరోవైపు ప్రియురాలి నుంచి పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి పెరిగింది. దీంతో ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. ఇదే విషయాన్ని పలుమార్లు స్నేహితులకు చెప్పుకున్నా.. తన బాధలు తీరలేదు. ఇటు భార్య, అటు ప్రియురాలికి సమాధానం చెప్పలేక దీపక్ కుమార్ శనివారం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
తండ్రి కరణ్‌లాల్ కి ఫోన్ చేసి ఎర్రకుంట సమీపంలోని పాడుబడిన బావిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు పేర్కొన్నాడు. వెంటనే అప్రమత్తమైన తండ్రి కరణ్‌లాల్ వెంటనే 100 నెంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.అప్పటికే దీపక్ కుమార్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం సైదాబాద్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: