Hyderabad: ఈ గుండెకు ఏమో అయ్యింది.. హార్ట్ అటాక్‌తో కాలేజ్‌లోనే కన్నుమూసిన బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ స్టూడెంట్‌.

ఎప్పుడు, ఏక్కడ నుంచి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోననే భయాలు వెంటాడుతున్నాయి. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని యవకులు గుండెపోటుతో పిట్టల్లా రాలిపోతున్నారు. అప్పటి వరకు సరాదాగా డ్యాన్స్‌ చేసిన కుర్రాడు కుప్పకూలి పోవడం. జిమ్‌లో వర్కవుట్‌ చేస్తున్న..

Hyderabad: ఈ గుండెకు ఏమో అయ్యింది.. హార్ట్ అటాక్‌తో కాలేజ్‌లోనే కన్నుమూసిన బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ స్టూడెంట్‌.
Representative Image

Updated on: Mar 03, 2023 | 6:00 PM

ఎప్పుడు, ఏక్కడ నుంచి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోననే భయాలు వెంటాడుతున్నాయి. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని యవకులు గుండెపోటుతో పిట్టల్లా రాలిపోతున్నారు. అప్పటి వరకు సరాదాగా డ్యాన్స్‌ చేసిన కుర్రాడు కుప్పకూలి పోవడం. జిమ్‌లో వర్కవుట్‌ చేస్తున్న యువకుడు గుండె పోటుతో క్షణాల్లో మరణించడం ఇలాంటి వార్తలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి .దీంతో అసలు గుండెకు ఏమవుతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఓ ఘటన అందరినీ కలవరానికి గురి చేస్తోంది. ఇంజనీరింగ్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోన్న ఓ కుర్రాడు గుండె పోటుతో మరణించడం అందరినీ షాక్‌కి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని మేడ్చల్‌లో ఉన్న సీఎంఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో శుక్రవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. కాలేజీ ఆవరణలో ఓ విద్యార్థి గుండెపోటుతో ఒక్కసారి కుప్పకూలాడు. దీంతో వెంటనే అలర్ట్‌ అయిన మిగతా విద్యార్థులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే లోపే ఆ కుర్రాడు మృతి చెందాడు. గుండె పోటుతో మరణించిన విద్యార్థి ఇంజనీరింగ్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు.

ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు చూస్తుంటే భయాందోళనలు కలిగిస్తున్నాయి. చిన్న వయసులో ఇలా గుండె పోటుతో మరణించడం కలవరపెడుతోంది. దీంతో అసలు గుండెకు ఏమవుతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే మంచి జీవన విధానం, పరిమితంగా వ్యాయామం, మంచి ఆహారం తీసుకోవడం వల్ల హృద్రోగాల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా ఏమాత్రం ఆరోగ్యంలో మార్పు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..