Hyderabad: సికింద్రాబాద్ బోయినపల్లిలో విషాద ఘటన… నాలాలో ప‌డి 7 ఏళ్ల‌ బాలుడి మృతి

|

Jun 05, 2021 | 3:50 PM

సికింద్రాబాద్ బోయినపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. చిన్నతోకట్ట నాలాలో పడి ఆనంద్ సాయి అనే ఏడేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. ఇంటి ముందు...

Hyderabad: సికింద్రాబాద్ బోయినపల్లిలో విషాద ఘటన... నాలాలో ప‌డి 7 ఏళ్ల‌ బాలుడి మృతి
Boy Fell In Nala
Follow us on

సికింద్రాబాద్ బోయినపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. చిన్నతోకట్ట నాలాలో పడి ఆనంద్ సాయి అనే ఏడేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో  ప్రమాదవశాత్తు కాలుజారి నాలాలో పపడిపోయాడు.  ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. స్థానికులు అక్కడికి చేరుకునేలోపే ఆనంద్‌సాయి గల్లంతయ్యాడు. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మూడు గంటల పాటు గాలించి.. ఆనంద్‌సాయి మృతదేహాన్ని బయటికి తీశారు. బాలుడి మృతిపట్ల కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే నాలాకు రక్షణ గోడ లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  బాలుడి డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటి వరకు కళ్లముందే ఆడుకుంటూ సందడి చేసిన కొడుకును అంతలోనే నాలా మింగేయటంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారిని ఓదార్చటం ఎవరి తరం కాకుండా పోయింది. కాగా బోయినపల్లి నాలా అభివృద్ధిని పట్టించుకున్న నాధుడే లేడు. గతంలో ఎన్నో సార్లు అధికారులకు, పాలకులకు స్థానికులు మొరపెట్టుకున్నారు. నాలా చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చెయ్యక పోవడంతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

Also Read: చెట్టుకు ఉన్న ఒక్క‌ ఆకుతో సుంద‌ర‌మైన గూడు నిర్మించిన ప‌క్షి… చూస్తే వావ్ అంటారు..

ఆక‌లితో ఉన్న పాము… ఓ భారీ సైజ్ గుడ్డును ఎలా మింగేసిందో మీరే చూడండి