Viral Video: హైదరాబాద్‌లో షాకింగ్‌ ఘటన.. క్షణాల్లోనే మెడికల్ షాపు వర్కర్ మృతి! వీడియో వైరల్

|

Jun 06, 2024 | 3:32 PM

హైదరాబాద్‌లోని ఓ ఫార్మసీ షాపులో పనిచేస్తున్న వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ షాకింగ్ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి సత్యనారాయణ కాలనీలో మే 5 (బుధవారం) చోటుచేసుకుంది. షాపులో మందులు ఇచ్చి, బిల్లింగ్‌ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్లే...

Viral Video: హైదరాబాద్‌లో షాకింగ్‌ ఘటన.. క్షణాల్లోనే మెడికల్ షాపు వర్కర్ మృతి! వీడియో వైరల్
Cardiac Arrest
Follow us on

హైదరాబాద్, జూన్‌ 6: హైదరాబాద్‌లోని ఓ ఫార్మసీ షాపులో పనిచేస్తున్న వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ షాకింగ్ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి సత్యనారాయణ కాలనీలో మే 5 (బుధవారం) చోటుచేసుకుంది. షాపులో మందులు ఇచ్చి, బిల్లింగ్‌ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్లే.. హైదరాబాద్‌లోని మేడ్చల్ జిల్లా కీసర గ్రామంలో ఉన్న మెడ్స్ ఫార్మసీలో పని చేస్తున్న మురళి (37) అనే వ్యక్తి కొనుగోలుదారులకు మందులు ఇచ్చాడు. అనంతరం బిల్లింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించాడు. గమనించిన షాపులోని తోటి సిబ్బంది సహాయక చర్యలు చేపట్టేలోపే మురళి ప్రాణాలు వదిలాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఐదేళ్ల పసివాళ్ల నుంచి పాతిక, ముప్పై యేళ్లలోపు యువత సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌తో మృతి చెందుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో గతేడాది మేడ్చల్‌లో ఓ వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొద్ది క్షణాల్లోనే గుండెపోటుతో మృతి చెందాడు. సీఎంఆర్‌ ఇంజనీరింగ్ కళాశాలలో 18 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి గుండెపోటుతో క్లాస్‌ రూంలోనే మరణించాడు.

ఇవి కూడా చదవండి

కార్డియాక్ అరెస్ట్ వచ్చినవెంటనే ఏం చేయాలి..

మెదడు, ఇతర శరీర అవయవాలు, కణజాలాలకు రక్తం, ఆక్సిజన్‌ను పంపింగ్ చేయడంలో ఇబ్బంది తలెత్తితే కార్డియాక్‌ అరెస్ట్ సంభవిస్తుంది. రక్త ప్రసరణలో ఆకస్మిక ఇబ్బంది తలెత్తి మెదడు దెబ్బతినడం, ఒక్కోసారి మరణం సంభవిస్తుంది. అయితే ఎవరైనా కార్డియాక్‌ అరెస్ట్‌కు గురైతే వెంటనే కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) చేయాలి. ఒకవేళ సకాలంలో సీపీఆర్‌ చేయకుంటే కార్డియాక్ అరెస్ట్ సంభవించిన 5 నిమిషాలకు మెదడు దెబ్బతినే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ సంభవించిన 8 నిమిషాలలోపు సీపీఆర్‌ చేయకపోతే మరణం కూడా సంభవించే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.