MMTS Trains: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలర్ట్.. పలు మార్గాల్లో రైళ్లు రద్దు..

|

Jan 16, 2022 | 3:17 PM

హైదరాబాద్ ఎంఎంటీఎస్ ప్రయాణికులకు ముఖ్య సూచన. ట్రాక్‌ మెయింటనెన్స్‌ పనుల నేపథ్యంలో ఈనెల 17వ తేదీన పలు మార్గాల్లో రైళ్లను రద్దు..

MMTS Trains: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలర్ట్.. పలు మార్గాల్లో రైళ్లు రద్దు..
Mmts Hyderabad
Follow us on

MMTS Trains Cancelled: హైదరాబాద్ నగరవాసులకు ముఖ్య సూచన. ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. నగరంలో లోకల్ ట్రైన్స్(ఎంఎంటీఎస్) సేవలను రద్దు చేసినట్లు వెల్లడించింది. నగరంలోని ట్రాక్స్ నిర్వహణ పనులు చేపట్టిన నేపథ్యంలో ఎంఎంటీఎస్ సేవలను మరో రోజు పాటు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 15,16 తేదీల్లో రద్దు చేసిన సేవలను మరో రోజుకు పొడిగించారు. ట్రాక్‌ మెయింటనెన్స్‌ పనుల నేపథ్యంలో ఈనెల 17వ తేదీన పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేసినట్లుగా రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. లింగంపల్లి-నాంపల్లి రూట్‌లో9 సర్వీసులు, నాంపల్లి-లింగంపల్లి వైపు9, ఫలక్‌నుమా-లింగంపల్లిలో 8, లింగంపల్లి-ఫలక్‌నుమా వైపు 8, సికింద్రాబాద్‌-లింగంపల్లి మార్గంలో 1, లింగంపల్లి-సికింద్రాబాద్‌ రూట్‌లో 1 సర్వీసును రద్దు చేసినట్లుగా ప్రకటనలో తెలిపారు.

రద్దు చేయబడిన రైళ్ల వివరాలు ఇలా..

36 MMTS SERVICES CANCELLED ON 17.01.2022 (MONDAY) OUT OF 79 MMTS SERVICES

1) LINGAMPALLI – HYDERABAD (9-SERVICES):-

47129,47132,47133,47135,47136,47137,47139,47138,47140

2) HYDERABAD – LINGAMPALLI (9-SERVICES) :-

47105,47109,47110,47111,47112,47114,47116,47118,47120

3) FALAKNUMA – LINGAMPALLI (8 SERVICES):
47153,47164,47165,47216,47166,47203,47220,47170

4) LINGAMPALLI – FALAKNUMA (8 SERVICES)

47176,47189,47186,47210,47187,47190,47191,47192

5) SECUNDERABAD – LINGAMPALLI (1 service): 47150

6) LINGAMPALLI –
SECUNDERABAD (1 Service): 47195

ఈ విష‌యాన్ని ప్ర‌యాణి కులు అర్థం చేసుకుని ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచు కోవాలి. పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపింది.

ఇవి కూడా చదవండి: Holidays Extension: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. విద్యా సంస్థల సెలవులు పొడిగింపు

Omicron Variant: ఒమిక్రాన్ తో మరిన్ని కొత్త వెరియంట్స్.. నిపుణుల హెచ్చరిక ఇదీ..పూర్తి వివరాలు..